కర్ణాటక ఎన్నికల్లో హైదరాబాద్ పార్టీ పోటీ, పొత్తు ఉంటే ? సై అంటున్న లీడర్స్ !
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి మరో పార్టీ సిద్దం అయ్యింది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న అసాదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐెం పార్టీ కర్ణాటకలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 25 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపడానికి రంగం సిద్దం చేసుకుంటున్నదని వెలుగు చూసింది.
కర్ణాటకకు చెందిన ఏఐఎంఐఎం పార్టీ సీనియర్ నాయకుడు ఒస్మాన్ ఘని మంగళవారం మీడియాతో మాట్లాడారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ బలంగా ఉన్న 25 నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఘని మీడియాకు చెప్పారు. జేడీఎస్ పార్టీతో పొత్త పెట్టుకుని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోందని, ఇప్పటికే మాజీ ప్రధాని దేవేగౌడతో చర్చలు జరిపామని ఘని వివరించారు.

అయితే జేడీఎస్ పార్టీ నుంచి ఇంత వరకు పొత్తు విషయంలో మాకు ఎలాంటి క్లారిటీ రాలేదని, మాజీ ప్రధాని దేవేగౌడ ఏం చెబుతారో అని మా పార్టీ అధినేత అసాదుద్దీన్ ఓవైసీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఘని అన్నారు. జేడీఎస్ పార్టీతో పొత్తు ఉన్నా లేకున్నా కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలో ఎంఐెంఎం పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని, ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లను మా పార్టీ ప్రకటించిందని ఘని వివరించారు.
ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే ముస్లీం ఓట్లు చీలిపోతాయని ఆరోపిస్తున్న కొన్ని పార్టీల నాయకులు కర్ణాటకలో ముస్లీంలకు కేటాంచిన 4 శాతం రిజర్వేషన్లను బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఎందుకు ఆందోళనలు చెయ్యలేదని, ఎందుకు మౌనంగా ఉండిపోయారని ఎంఐఎం పార్టీ నాయకులు ప్రశ్నించారు. 2018లో జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న ఎంఐఎం పార్టీ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చెయ్యలేదు. అయితే 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కచ్చితంగా పోటీ చేస్తోందని ఆ పార్టీ నాయకులు క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications