వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయకు షాక్: 4 వేల పేజీలతో సుప్రీంకు కర్ణాటక అప్పీల్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం నాలుగు వేల పేజీలతో సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. అందులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన 100 పేజీల తీర్పు ప్రతులను కూడా పొందుపరిచారు.

అక్రమాస్తులు సంపాదించారని జయలలితతో పాటు మరొ ముగ్గురి మీద కేసులు నమోదు అయ్యింది. ఈ కేసులో జయలలిత తదితరులకు బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. తరువాత జయలలిత తదితరులు కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు.

The appeal filed by the Karnataka government in the J Jayalalithaa case

కేసు విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కుమారస్వామి జయలలిత అక్రమ ఆస్తులు సంపాదించలేదని కేసును కొట్టి వేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీ.వీ. ఆచార్య ఈ కేసును సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని పట్టుబట్టారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన మంత్రి వర్గంతో పదేపదే చర్చించి చివరికి సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని నిర్ణయించారు. మంగళవారం నాలుగు వేల పేజీల డాక్యూమెంట్ లతో సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు తీర్పును చాలెంజ్ చేస్తు సుప్రీం కోర్టును ఆశ్రయించామని న్యాయనిపుణలు అంటున్నారు.

English summary
The appeal filed by the Karnataka government in the J Jayalalithaa disproportionate assets case in the Supreme Court comprises 4,000 pages. The appeal which will in all probability filed by Tuesday contains annexures running upto 3,900 pages while the grounds seeking to set aside the verdict of the Karnataka High Court contains 100 pages
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X