Ship MV: భారత్‍కు చేరుకున్న దాడికి గురైన నౌక ఎంవీ..
అరేబియా సముద్రంలో దాడికి గురైన ఇండియన్ షిప్ భారత్ కు చేరుకుంది. దాడికి గురైన వ్యాపార నౌక MV లో విచారణ చేపట్టారు.భారత నౌకాదళానికి చెందిన పేలుడు పదార్థాలపై విస్తృత విచారణ చేపట్టిన అధికారులు.. తాజాగా మరింత సమాచారం కోసం ఫోరెన్సిక్, సాంకేతిక విశ్లేషణ చేపట్టామని నౌకాదళాధికారులు వివరించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసిజిఎస్ విక్రమ్ రక్షణలో, ఎంవి కెమ్ ప్లూటో సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ముంబై నౌకాశ్రయానికి చేరుకుంది.
ఓడపై దాడి ఎలా జరిగిందనే దానిపై భారత కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, సంబంధిత అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. నౌకపై దాడి చేసేందుకు ఉపయోగించిన క్షిపణినా లేక డ్రోనా అనే విషయాన్ని గుర్తించేందుకు ఏజెన్సీలు ప్రయత్నిస్తాయి. నౌకలో లభ్యమైన పేలుడు పదార్ధాలు, శకలాలను బట్టి ఇది ఖచ్చితంగా డ్రోన్ దాడేనని భావిస్తున్నారు.

నౌకాదళానికి చెందిన నేవల్ ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ స్పెషలిస్ట్ నౌకను క్షుణ్ణంగా పరిశీలించారని, తదుపరి విచారణ కొనసాగుతోందని నౌకాదళం తెలిపింది. డిసెంబర్ 24న పోర్ బందర్ కు 217నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌకపై దాడి జరిగింది. ఈ దాడి కారణంగా నౌకలో పేలుడు, మంటలు సంభవించాయి, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ సమయంలో ఓడల 21 మంది ఇండియన్ స్టాఫ్ ఉన్నారని తెలుస్తోంది.
ఘటనకు సంబంధించిన సమాచారమందుకున్న భారత నౌకాదళం, యుద్ధ నౌకలు ఆ ప్రాంతానికి చేరుకుని.. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టి నౌకను ఇండియాకు తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను పెంచిందని రక్షణ అధికారులు తెలిపారు. నావికాదళం మూడు యుద్ధనౌకలను -- INS మోర్ముగావ్, INS కొచ్చి, INS కోల్‌కతాను కూడా మోహరించింది. P-8I లాంగ్-రేంజ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా సేవలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications