• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్షణ క్షణం.. భయం భయం..! కశ్మీర్‌లో యుద్ద మేఘాలు..! ఉత్కంఠ పరిణామాలు..! ఏం జరుగుతుంది..?

|

ఢిల్లీ/జమ్మూకశ్మీర్‌ : దేశంలో మరోసారి ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏళ్ల తరబడి నలుగుతున్న కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు బీజేపి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ లో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. శ్రీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. అలానే నేడు విద్యాసంస్థలను మూసివేయనున్నారు. ఇక కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో ఎక్కడ ఏం జరుగుతుందో అని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ప్రజలు శాంతంగా ఉండాలని వారికి ఓ ట్వీట్‌ ద్వారా మాజీ సీఎం ఒమర్‌ విజ్ఞప్తి చేశారు. 'రేపు ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి. ఈ రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది' అని మరో మాజీ సీఎం మెహబూబా ట్వీట్‌ చేశారు.

కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి..! పోరాటం చేస్తోన్న బీజేపి ప్రభుత్వం..!!

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగ అధికరణాల రద్దు, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఏదైనా ప్రయత్నం జరిగితే గట్టిగా ప్రతిఘటించాలని ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ పక్షాల సమావేశం తీర్మానించడం, రాజ్యాంగ ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునివ్వడం వేడిని పెంచింది. సంప్రదాయంగా బుధవారాల్లో సమావేశమయ్యే కేంద్ర కేబినెట్‌ ప్రత్యేకంగా సోమవారం భేటీ అవుతుండటం.. అందులో ఏదో అసాధారణ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో తాజా పరిణామాలు మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

కాశ్మీరీల హ‌క్కు 35ఏ: ర‌ద్దు చేస్తున్నారంటూ ప్ర‌చారం: ఈ చ‌ట్టం ఎందుకు..ఏం చెబుతోంది..!

అలుముకుంటున్న యుద్ద మేఘాలు..! అడుగడుగునా ఉత్కంఠ..!!

అలుముకుంటున్న యుద్ద మేఘాలు..! అడుగడుగునా ఉత్కంఠ..!!

అంతకుముందు హోంమంత్రి అమిత్‌షా జాతీయ భద్రతా సలహాదారు, నిఘా, రా అధినేతలతోపాటు, సీనియర్‌ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అమిత్‌షా కశ్మీర్‌లో పర్యటనకు సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు సంసిద్ధమయ్యాయి. శ్రీనగర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో అడుగడుగునా బలగాలను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే అణచివేసేందుకు, కాశ్మీర్ తిరుగుబాటు దారుల నుంచి పొంచి ఉన్న ముప్పును అణచివేసేందుకు అన్నిరకాలుగా సిద్దంగా ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం సంసిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది.

జమ్ముకశ్మీర్ మూడు ముక్కలు కాబోతుందా..? ప్రధాని ఏం చేయబోతున్నారు..!!

జమ్మూకశ్మీర్‌లో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జమ్ముకశ్మీర్ మూడు ముక్కలు చేయబోతున్నరనే వార్తలు వస్తున్నాయి. జమ్ము, కశ్మీర్‌లుగా రాష్ట్రాన్ని రెండు వేర్వేరు రాష్ట్రాలుగా విడగొట్టి లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నేడు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఆ వెంటనే అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. అంతేకాకుండా జమ్ముకశ్మీర్‌ను మూడు ముక్కలు చేసే బిల్లుకు నేడే ఆమోద ముద్ర కూడా పడుతుందని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం అమలైతే కశ్మీర్‌కు ఇప్పటి వరకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్‌ 370, 35-Aలు కాలగర్భంలో కలిసిపోతాయి.

ఉగ్రచర్యలపై ఉక్కు పాదం..! కశ్మీర్ భారత్ లో అంతర్బాగమే..!!

ఉగ్రచర్యలపై ఉక్కు పాదం..! కశ్మీర్ భారత్ లో అంతర్బాగమే..!!

నిజానికి గత నెల 26తోనే పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉండగా వాటిని ఈ నెల ఏడో తరగతి వరకు పొడిగించడం, చరిత్రలో తొలిసారిగా అమర్‌నాథ్ యాత్రను అర్థాంతరంగా నిలిపివేయడం, జమ్ముకశ్మీర్‌లో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించడం, ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం, మాజీ ముఖ్యమంత్రులను గృహ నిర్బంధంలోకి తీసుకోవడం లాంటివి ఇందులో భాగమేనని అంచనా వేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There are once again thrilling developments in the country. The BJP government is stepping up to find a permanent solution to the Kashmir issue that has been on for years. In this backdrop, things have suddenly warmed up in Jammu and Kashmir. There were unexpected developments on Sunday midnight in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more