CM: సీఎంకు సీన్ ఎక్కువ, మాజీ సీఎంకు మైనస్ లు ఎక్కువ, సార్ ఏం చేస్తున్నారు ?, మడత !
సిట్టింగ్ సీఎంలకు సీఎన్ ఎక్కువ, మాజీ సీఎంలకు మైనస్ లు ఎక్కువ. ఎస్ మరోసారి అదే నిజం అయ్యింది. ఎవరి కారణంగా అధికారంలో వచ్చామో అనేది ముఖ్యం కాదు.
బెంగళూరు/న్యూఢిల్లీ: సిట్టింగ్ సీఎంలకు సీఎన్ ఎక్కువ, మాజీ సీఎంలకు మైనస్ లు ఎక్కువ. ఎస్ మరోసారి అదే నిజం అయ్యింది. ఎవరి కారణంగా అధికారంలో వచ్చామో అనేది ముఖ్యం కాదు, మనం ఎవరికి పట్టం కట్టాలో అనేదే ముఖ్యం అని కొందరు నాయకులు అనుకున్నట్లు ఉన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నానా తంటాలుపడిన మాజీ సీఎం ఇప్పుడు నెంబర్ టూ అయిపోయారు. ఎవ్వరూ ఊహించని విధంగా సీఎం అయిపోయిన వ్యక్తి ఈ రోజు నెంబర్ వన్ అయిపోయారు. అసలు మ్యాటర్ ?

ప్రధాని మోదీ ఎం చెప్పారు ?
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటించి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మనం అభివృద్ది చెందుతామని, మరోసారి కర్ణాటకలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు మనవి చేశారు.

పేరుకు మాత్రమే ?
దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఢిల్లీ పెద్దలు ఎంత కష్టపడ్డారో అంతే కష్టం కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప కష్టపడ్డారు. దక్షిణ భారతదేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి నానా తంటాలు పడిన బీఎస్ యడియూరప్ప చివరికి ఆపరేషన్ కమల కూడా మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన బీఎస్. యడియూరప్ప సీఎం కుర్చిలో కుర్చుని బీజేపీ ఖాతాలో మరో రాష్టాన్ని చేర్చారు.

అన్నా నీకు వయసు అయిపోయింది ?
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆపరేషన్ కమలతో పడగొట్టిన యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. తన పదవి కాలం పూర్తిగా సీఎంగా ఉండాలని బీఎస్. యడియూరప్ప ఎన్నో కలలుకన్నారు. అయితే మధ్యలో చాలా జరిగిపోయాయి. బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చిన యడియూరప్ప సీఎం కుర్చీకి ఎసరుపెట్టారు. నీకు వయసు మీదపడిపోయింది మిత్రమా అంటూ బీఎస్ యడియూరప్పను సీఎం పదవి నుంచి కిందకు దించేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఎవరు నెంబర్ వన్ ?, ఎవరు నెంబర్ టూ
యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత అప్పటి అప్ప క్యాబినేట్ లో హోమ్ మంత్రి అయిన బసవరాజ్ బోమ్మయ్ సీఎం అయ్యారు. ఎవ్వరూ ఊహించిన విధంగా బసవరాజ్ బోమ్మయ్ సీఎం కావడంతో యడియూరప్ప వర్గంలోని కొందరు నాయకులు ఆ విషయం జీర్ణించుకోలేకపోయారు. అయితే బసవరాజో బోమ్మయ్ ని సీఎం చెయ్యాలని యడియూరప్ప స్వయంగా బీజేపీ హైకమాండ్ కు సిఫారస్సు చేశారని పుకార్లు కూడా ఉన్నాయి.

నిన్నకొడుకు.....నేడు తండ్రి
బసవరాజ్ బోమ్మయ్ సీఎం అయిన తరువాత యడియూరప్ప పెద్ద కుమారుడు బీఎస్. విజేయంద్రకు మంత్రి పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది, బీఎస్. విజయేంద్రకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడి పదవి యడియూరప్పకు ఇస్తారని బీజేపీ నాయకులు అనుకున్నారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడి బాధ్యతలను సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి అప్పగించిన బీజేపీ హైకమాండ్ మాజీ సీఎం బీఎస్ యడియూరప్పను కేవలం ఆ ప్రచార కమిటీలో సభ్యుడిగా నియమించడం హాట్ టాపిక్ అయ్యింది.

అందరూ సైలెంట్
బీజేపీ హైకమాండ్ బీఎస్ యడియూరప్పను సైడ్ చేసిందని ఆయన వర్గీయులు లోలోపల ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో లింగాయత్ కులంలో బలమైన నాయకుడు, కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసిన బీఎస్ యడియూరప్పకు సరైన స్థానం కల్పించడం లేదని ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. అయితే ఈ విషయంలో బీఎస్ యడియూరప్ప కాని, ఆయన కుమారులు కాని, అప్పకు అత్యంత సన్నిహితులైన మంత్రులు కాని నోరు విప్పడం లేదు.












Click it and Unblock the Notifications