వివాహిత మహిళతో అక్రమ సంబంధం, అర్దరాత్రి తలుపు తియ్యలేదని అక్కడ యాసిడ్ పోశాడు !

కర్ణాటకలోని బాగల్‌కోట్ తాలూకాలోని గడ్డనకేరి క్రాస్‌లో వివాహిత ప్రేమికుడు ఇంటి తలుపులు తీయకపోవడంతో అతని ప్రియురాలిపై కిటికీలోంచి యాసిడ్‌ పోసేశాడు. ప్రియురాలి మీద యాసిడ్ దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడి యాసిడ్ దాడిలో లక్ష్మి (33) అనే మహిళ గాయపడిందని పోలీసులు అన్నారు. లక్ష్మీ మీద యాసిడ్ దాడి జరిగిన సమయంలో ఆమె కుమార్తె మీద యాసిడ్ పడిందని పోలీసులు అన్నారు.

మౌనేష్ అనే నిందితుడు అతని ప్రియురాలు లక్ష్మీ మీద యాసిడ్ పోసి ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఉన్నాడని పోలీసులు అంటున్నారు. యాసిడ్ దాడి కారణంగా లక్ష్మీ ఎడమ కన్ను, ముఖంపై కాలిన గాయాలయ్యాయి. లక్ష్మీ ప్రస్తుతం బాగల్ కోటే జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. లక్ష్మీ ఎనిమిదేళ్ల కుమార్తె కూడా యాసిడ్ దాడి కారణంగా ముఖంపై గాయమైందని, ఆమె కూడా ఆసుపత్రిలో ఉందని పోలీసులు తెలిపారు.

యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ, నిందితుడు మౌనేష్ ఇద్దరూ విజయపుర నగరంలోని మూర్నకేరికి చెందినవారు. మౌనేష్ విగ్రహాలు తయారు చేసేవాడు. గతంలో లక్ష్మీ వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది మౌనేష్ కూడా వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు. తరువాత లక్ష్మీ, మౌనేష్ శారీరక సంబంధం పెట్టుకున్నారు. గత ఏడాది నుంచి లక్ష్మీ, మౌనేష్ అక్రమ సంబంధం పెట్టుకుని ఇళ్లలో వారి కుటుంబ సభ్యులకు తెలీకుండా ఎంజాయ్ చేస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

లక్ష్మీ ఆమె భర్తతో కాని, మౌనేష్ అతని భార్య కాని విడాకులు తీసుకోకుండా ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి లివింగ్ టు గెదర్ లో ఉన్నారు. అయితే అనధికారికంగా నెలన్నర రోజులుగా గడ్డనకేరి క్రాస్‌లోని ఒకే ఇంటిని అద్దెకు తీసుకున్న లక్ష్మీ, మౌనేష్ కలిసి నివాసం ఉంటున్నారు. పరస్పర అంగీకారంతో ఒకే ఇంట్లో ఉంటూ కాపురం చేస్తున్న ఇద్దరూ పెళ్లి మాత్రం చేసుకోలేదని తెలిసింది. లక్ష్మీతో పాటు ఆమె కుమార్తె కూడా అదే ఇంటిలో ఉంటున్నది.

The boy friend of the woman who had an illicit relationship did not answer the door of the acid attack in Karnataka
తాడిపత్రిలో మాయాజాలం, అధికారులపై మండిపడిన కలెక్టర్, ఏం తమాషా చేస్తున్నారా ?

లక్ష్మి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని ఆమె ప్రియుడు మౌనేష్ కు అనుమానం వచ్చింది. ఇదే విషయంలో పలుమార్లు అనుమానం వ్యక్తం చేసిన మౌనేష్ అతని ప్రియురాలు లక్ష్మీతో గొడవ పడేవాడని పోలీసులు చెబుతున్నారు.ఈ విషయమై గొడవపడిన మౌనేష్ గత వారం రోజుల క్రితం లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత లక్ష్మి ఆమె ప్రియుడు మౌనేష్ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసింది.

రాత్రి తిరిగి ఇంటికి వచ్చిన మౌనేష్ తలుపు తియ్యాలని లక్ష్మీకి చెప్పాడు. అయితే లక్ష్మీ తలుపులు తియ్యడానికి నిరాకరించింది. ఎంత చెప్పినా లక్ష్మి మాత్రం తలుపు తీయలేదు. దీంతో కోపోద్రిక్తుడైన మౌనేష్ యాసిడ్ నీళ్లలో కలిపి కిటికీలో నుంచి ప్రియురాలు లక్ష్మీ మీదకు విసిరేశాడు. లక్ష్మీతో పాటు ఆమె కూతురి మీద యాసిడ్ పడటంతో ఇద్దరికి గాయాలైనాయని పోలీసులు తెలిపారు. యాసిడ్ దాడి చేసి పారిపోతున్న మౌనేష్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+