తాడిపత్రిలో మాయాజాలం, అధికారులపై మండిపడిన కలెక్టర్, ఏం తమాషా చేస్తున్నారా ?
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత కూడా పలు నియోజక వర్గాలు నిత్యం వార్తల్లోనే ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో అధికార పార్టీ అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని ఇంతకాలం టీడీపీ నాయకులు ఆరోపిస్తూనే ఉన్నారు. చివరికి కలెక్టర్ రంగంలోకి దిగడంతో తాడిపత్రిలో ప్రభుత్వ అధికారులు సక్రమంగా పని చెయ్యడం లేదని, కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని వెలుగు చూసింది.
తాడిపత్రిలో అక్రమ ఇసుక రవాణా కావడానికి అసలు ఆస్కారం లేదని ఇంతకాలం కలెక్టర్ ను తప్పుదోవ పట్టించిన అధికారుల అసలు బండారం బట్టబయలు అయ్యింది. తాడిపత్రి పట్టణం సమీపంలోని పెన్నానదిలో ఉన్న ఇసుక రేవును అధికారులు మూసివేశారు. ఎన్నికల నియమాలు అమలులో ఉండటం, పై నుంచి ఆదేశాలు రావడంతో ఇసుక రేవును మూసివేశారు. ఇసుక రవాణా ఏమాత్రం జరగకూడదని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇసుక రేపు ఉన్న ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఇంతకాలం అక్రమంగా ఇసుక రవాణా అవుతోంది. కలెక్టర్ వినోద్ కుమార్ కు అనుమానం వచ్చి తాడిపత్రి పట్టణం సమీపంలోని ఇసుక రేవులను పరిశీలించారు. అయితే ఇసుక అక్రమంగా తరలిపోతుండటంతో కలెక్టర్ వినోదక్ కుమార్ సంబంధిత అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారని వెలుగు చూసింది.
భూగర్బ గనుల శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు, సెబ్ శాఖ అధికారులు అందరూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేదని వెలుగు చూడటంతో అందరిని కలెక్టర్ వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా వెంటనే అవసరం అయిన చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గత కొంతకాలం అనంతపురం రేంజ్ డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు, సాయుధ బలగాలతో నిత్యం విధులు నిర్వహిస్తున్నా తాడిపత్రి నుంచి అక్రమంగా ఇసుక తరలిపోతుందని వెలుగు చూడటంతో కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను నిలదీశారని తెలిసింది. నిత్యం పెన్నానదిని కబళిస్తూ ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్న అధికారులను మందలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఇంకోసారి ఇలా జరిగితే చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకుంటానని హెచ్చరించారని తెలిసింది.

తాడిపత్రి పట్టణ పరిసర ప్రాంతాల్లోని శ్రీనివాసపురం, నందలపాడు మండలాల పరిధిలోని చింతపల్లి, జూటూరు, కుమ్మెత, నరసాపురం గ్రామాల పరిధిలోని పెన్నానదిలో పగలు, రాత్రి అని తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిసింది. పెన్నానది నుంచి ఇసుకను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని, అక్కడి నుంచి లారీలు, టిప్పర్లలో బెంగళూరు, కర్నూలు, బళ్లారిలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.
అక్రమంగా ఇసుకను తకలిస్తూ ఒక్కొక్క లోడు నుంచి రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద తాడిపత్రి వ్యవహారం మరోసారి వెలుగులోకి రావడంతో ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతం వార్తల్లో నిలిచింది. ఇసుక అక్రమ రవాణా కాకుండా అధికారులు తాడిపత్రి పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టుటు ఏర్పాటు చేస్తున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications