Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బినామీ క్వీన్ శశికళ ఫ్యామిలీ మీద ఐటీ శాఖ గురి, మరిన్ని చిక్కుల్లో చిన్నమ్మ !

మన్నార్ గుడి మాఫియా కుటుంబాన్ని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయ్యడానికి వ్యూహరచనలు సాగుతున్నాయని, చిన్నమ్మ శశికళ బినామీలను టార్గెట్ చేసుకుని త్వరలో మరన్ని ఆదాయపన్ను శాఖ దాడులు జరిగే అవకాశం ఉందని ప్రచారం

న్యూఢిల్లీ/చెన్నై: మన్నార్ గుడి మాఫియా కుటుంబాన్ని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయ్యడానికి వ్యూహరచనలు సాగుతున్నాయని, చిన్నమ్మ శశికళ బినామీలను టార్గెట్ చేసుకుని త్వరలో మరన్ని ఆదాయపన్ను శాఖ దాడులు జరిగే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది.

జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే పార్టీని గుప్పెట్లోకి తీసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని కలలు కన్న చిన్నమ్మ సుప్రీం కోర్టు తీర్పుతో చివరికి బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలుకు పరిమితం అయ్యారు.

ఈ విషయాన్ని మన్నార్ గుడి మాఫియా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. శశికళ కుటుంబ సభ్యుల మీద అనేక నమోదు అయిన కేసుల విచారణ ఇప్పటకీ పెండింగ్ లో ఉన్నాయి. చిన్నమ్మ కుటుంబ సభ్యులకు మున్ముందు మరని షాక్ లు ఇవ్వడానికి అధికారులు రంగం సిద్దం చేస్తున్నారని సమాచారం.

టీటీవీ దినకరన్ ను నమ్మితే

టీటీవీ దినకరన్ ను నమ్మితే

జైలుకు వెళ్లిన శశికళ తన ప్రతినిధిగా అక్క వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాని కార్యదర్శిగా నియమించారు. అయితే రెండాకుల చిహ్నం కోసం ఏకంగా ఎన్నికల యంత్రాగానికి రూ. 50 కోట్లు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని నమోదు అయిన కేసులో దినకరన్ కటకటాల పాలయ్యాడు.

చాపకింద నీరులా మన్నార్ గుడి మాఫియా

చాపకింద నీరులా మన్నార్ గుడి మాఫియా

శశికళ, దినకరన్ కేసుల రూపంలో పార్టీకి దూరం అయినా మన్నార్ గుడి మాఫియా చాప కింద నీరులా వ్యూహాలకు పదునుపెట్టే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ పెద్దలకు సమాచారం వెళ్లిందని తెలిసింది. శశికళ మన్నార్ గుడి మాఫియాని అణిచివేయడానికి అస్త్రాలను ప్రయోగించేందుకు ఢిల్లీ సిద్దం అయ్యిందని సంకేతాలు వెలువడ్డాయి.

మూడు రాష్ట్రాల్లో చిన్నమ్మ బినామీలు !

మూడు రాష్ట్రాల్లో చిన్నమ్మ బినామీలు !

శశికళ కుటుంబానికి చెందిన వారి గుప్పెట్లో అనేక సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు, వ్యాపారాలు ఉన్నాయని గతంలో తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. తమిళనాడుతో సహ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కర్ణాటకలో శశికళకు బినామీ ఆస్తులు ఉన్నాయని, జయలలితను అడ్డం పెట్టుకుని శశికళ ఆస్తులు సంపాదిస్తున్నారని విమర్శలు వచ్చాయి.

ఐటీ అధికారుల గురి

ఐటీ అధికారుల గురి

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని శశికళ బినామీ ఆస్తుల వివరాలను ఐటీ శాఖ అధికారులు సేకరిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే శశికళకు చెందిన అనేక అక్రమ ఆస్తుల వివరాలు ఢిల్లీ పెద్దల దగ్గర ఉన్నాయని, వాటిని అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం.

జయలలిత ఆస్తులు ఎవరి చేతిలో !

జయలలిత ఆస్తులు ఎవరి చేతిలో !

జయలలిత మరణించిన తరువాత ఆమెకు చెందిన ఆస్తుల పర్యవేక్షణ ఎవ్వరెవ్వరి చేతుల్లో ఉన్నాయి అంటూ ఆరా తీస్తున్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్, కొడనాడు టీ ఎస్టేట్, సిరుదాపూర్ బంగ్లా, హైదరాబాద్ లోని ద్రాక్ష తోట తదితర ఆస్తులను ఎవ్వరెవ్వరు పర్యవేక్షిస్తున్నారు అని ఆరా తీస్తున్నార వెలుగు చూసింది.

శశికళ బినామీ ఆస్తులు ఇవే !

శశికళ బినామీ ఆస్తులు ఇవే !

తమిళనాడు ప్రభుత్వ పర్యవేక్షణలోని టాస్మాక్ వైన్ షాప్ లకు భారీ మొత్తంలో మద్యం సరఫరా చేస్తున్న మిడాస్ లిక్కర్ కంపెనీ, జాజ్ సినిమాస్, ఓ దినపత్రిక, జయ టీవీ తదితర ఆస్తులు శశికళ బినామీ పేర్లతో ఉన్నాయని, అందులో ఆమెకు ఎన్ని షేర్లు ఉన్నాయి, మిగిలిన షేర్లు ఎవరిపేరుతో ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

శశికళ బినామీలు, ఐటీ టార్గెట్ వీరే ?

శశికళ బినామీలు, ఐటీ టార్గెట్ వీరే ?

శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ కటకటాలపాలైనా ఆమె కుటుంబ సభ్యుల మీద ఐటీ శాఖ అధికారులు నిఘా వేశారు. శశికళ భర్త నటరాజన్, శశికళ సోదరుడు దివాకరన్, శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జాజ్ సినిమాస్ సీఈవో వివేక్, శివకుమార్, వెంకటేష్, అనురాధ తదితరుల మీద ఐటీ శాఖ అధికారులు నిఘా వేశారని, ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉందని తమిళ మీడియా కోడైకూస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+