చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లకలకలక, ఎలుకలు పట్టుకోవడానికి రూ. 5. 89 కోట్లు ఖర్చు, రైల్వే లీలలు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రయాణికులకు ఎలుకలతో వస్తున్న ఇబ్బందులను అరికట్టడానికి రైల్వే శాఖ అధికారులు భారీ మొత్తంలో ఖర్చు చేసి తీవ్ర చర్చకు తెరలేపారు. ఒక్క ఎలుకను పట్టుకోవడానికి సరాసరి రూ. 22, 300 ఖర్చు చేశారు. మొత్తం ఎలుకలను పట్టుకోవడానికి రూ. 5. 89 కోట్లు ఖర్చు చేసిన రైల్వే శాఖ అధికారులు తీవ్ర చర్చకు దారి తీశారు. ఆర్ టీఐ సమాచారంతో రైల్వే అధికారులు చేసిన ఈ పని వివరాలు బయటకు రావడంతో ప్రజలు ముక్కున వేలు వేసుకున్నారు..

బెంగళూరు సెంట్రల్ జైల్లో సీసీబీ దాడులు, మొబైల్ లు, గంజాయి, కత్తులు, వీకే. శశికళ!బెంగళూరు సెంట్రల్ జైల్లో సీసీబీ దాడులు, మొబైల్ లు, గంజాయి, కత్తులు, వీకే. శశికళ!

చెన్నై రైల్వే విభాగంలో అనేక రైళ్లలోని బోగీల్లో ఎలకతో ప్రయాణికలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైల్వే శాఖ అధికారులు అంటున్నారు. 2016 మే నుంచి 2019 ఎఫ్రిల్ వరకు పలు భోగీల్లో ఎలుకలను పట్టుకోవడానికి రైల్వే శాఖ అధికారులు రూ. 5. 89 కోట్లు ఖర్చు పెట్టారు.

 the Chennai division of Indian Railways have spent a whopping Rs 5.89 crore to tackle rat menace

2018-19లో మొత్తం 2,636 ఎలుకలు బోనులో పడ్డాయి. 1, 715 ఎలుకలు చెన్నై సెంట్రల్, చెంగలపట్టు, తాంబరమ్, జోళార్ పేట్ జంక్షన్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లలో ఎలుకలను బోనులో పట్టుకున్నారు. రైల్వే కోచింగ్ స్టేషన్ లో 921 ఎలుకలను పట్టుకున్నారని ఆర్ టీఐ సమాచారంలో వెలుగు చూసింది.

మోడీ మీద నమ్మకం ఉంది, నేను ప్రజల ఎంపీని, ఆ పార్టీ మనిషిని కాదు, సుమలత!మోడీ మీద నమ్మకం ఉంది, నేను ప్రజల ఎంపీని, ఆ పార్టీ మనిషిని కాదు, సుమలత!

ఆర్ టీఐ సమాచారం మేరకు ఒక్క ఎలుకను పట్టుకోవడానికి సుమారు రూ. 22, 334 ఖర్చు చేశారని వెలుగు చూసింది. ఎలుకలను పట్టుకోవడానికి ఎందుకు ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేశారని కొన్ని మీడియా సంస్థలు చెన్నై రైల్వే స్టేషన్ సీపీఆర్ ఓ ధనంజయ్, సీనియర్ పీఆర్ ఓ ఓం ప్రకాష్ ను వివరణ కోరాయి.

అయితే ఇద్దరు అధికారులు ఈ విషయంలో వివరణ ఇవ్వడానికి నిరాకరించారు. మొత్తం మీద ఆర్ టీఐ సమాచారంతో ఎలుకలను పట్టుకోవడానికి రూ. 5. 89 కోట్లు ఖర్చు చేశారని వెలుగు చూడటంతో ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

English summary
Tamil Nadu: From May 2016 to April 2019, the Chennai division of Indian Railways have spent a whopping Rs 5.89 crore to tackle rat menace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X