దూసుకుపోతున్న ప్రతిపక్షం, రెండో జాబితా విడుదల, సైలెంట్ గా స్కెచ్ వేస్తున్న మోదీ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీల మధ్య నువ్వానేనా ? అన్నట్లు పోటీ తారాస్థాయికి చేరింది. మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందు 124 మందితో మొదటి జాబితా విడుదల చేసింది. అయితే బీజేపీ మాత్రం ఇంత వరకు ఒక్క అభ్యర్థి పేరు ప్రకటించలేదు. అంతే హుషారుగా ఉన్న కాంగ్రెస్ రెండో జాబితాను విడుదల చేసింది.
గురువారం న్యూఢిల్లీలో ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, యువరాజు రాహుల్ గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. 42 మందితో రెండో జాబితాను విడుదల చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీలో కొందరు హుషారుగా ఉండటంతో మరి కొందరు ఢీలా పడిపోయారు.

124 మందితో మొదటి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు 100 నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపిక విషయం పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. అనేక కసరత్తులు చేసిన కాంగ్రెస్ చివరికి 42 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన ఎన్ వై, గోపాలక్రిష్ణకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది.
మాజీ సీఎం సిద్దరామయ్యకు మొదటి జాబితాలోనే వరుణా నియోజక వర్గం కేటాయించారు. అయితే తాను కోలారు నుంచి పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వండి అంటూ సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి మనవి చేశారు. అయితే రెండో జాబితాలో తనకు కోలారు నియోజక వర్గం కేటాయిస్తారు అని ఎదురు చూసిన సిద్దరామయ్యకు హైకమాండ్ షాక్ ఇచ్చింది.
రెండో జాబితాలో కూడా సిద్దరామయ్యకు కోలారు నియోజక వర్గం సీటు కేటాయించలేదు. ఇక గతంలో సిద్దరామయ్య ఎమ్మెల్యేగా గెలిచిన బాదామి నియోజక వర్గం సీటు ఈ సారి బీమ్ సేన్ బి. చిమ్మనకట్టికి కేటాయించారు. బెంగళూరులోని యలహంక, మహాలక్ష్మి లేఔట్, పద్మనాభనగర నియోజక వర్గాల అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications