ఎయిర్ పోర్టులు తెరుచుకున్న మరునాడే.. ఆ నగరాలకు ఫ్లైట్స్ బంద్!
భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలలో 32 ఎయిర్పోర్ట్ లలో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కాల్పుల విరమణ నేపథ్యంలో మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఎయిర్పోర్ట్ సర్వీసులను మళ్లీ పునరుద్ధరించిన మరుసటి రోజే పలు దేశీయ విమానయాన దిగ్గజాలు తమ సర్వీసులను రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి.
ఆ ఎయిర్ పోర్టులకు విమానాలు రద్దు
సరిహద్దులలో ఇంకా టెన్షన్ వాతావరణమే ఉందని భావించి, పాకిస్తాన్ దుశ్చర్యలకు భయపడుతున్న క్రమంలో, భద్రతా కారణాల దృష్ట్యా కీలక నగరాలకు తమ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రకటించాయి. అమృతసర్, చండీగఢ్, శ్రీనగర్, జమ్మూ వంటి నగరాలకు వెళ్లవలసిన విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన రెండు విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశాయి.

ఎయిర్ ఇండియా ఈ నగరాల సర్వీసుల నిలిపివేత
ఎయిర్ ఇండియా జమ్మూ, లేహ్, జోద్ పూర్, అమృత్ సర్, భుజ్, జాంనగర్, చండీగఢ్, రాజ్కోట్ లకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన ఎయిర్ ఇండియా, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎక్స్ వేదికగా ఒక పోస్టులో వెల్లడించింది.
ఇండిగో సర్వీసులను నిలిపివేసిన నగరాలు ఇవే
మరోవైపు ఇండిగో కూడా జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌లకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రయాణికులకు అందిస్తామని, ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని, భద్రతా కారణాల దృశ్యాన్ని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఎయిర్పోర్ట్ లలో సర్వీసులు ప్రారంభించి 24 గంటలైనా కాకముందే షాకింగ్ నిర్ణయం
నిన్నటికి నిన్న 32 విమానాశ్రయాలలో కార్యకలాపాలను పునరుద్ధరించినట్టు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించి 24 గంటలు ఉన్న పూర్తికాకముందే భద్రతా కారణాలతో దేశీయ విమానయాన సంస్థలు కీలక విమానాశ్రయాలకు తమ సర్వీసులను రద్దు చేయడం గమనార్హం. పాకిస్తాన్ ను పూర్తి స్థాయిలో నమ్మలేని పరిస్థితిలో, సరిహద్దు రాష్ట్రాలలో పాక్ డ్రోన్ లు సంచరిస్తున్నాయి అన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.












Click it and Unblock the Notifications