Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవిశ్వాసం పై చర్చ కు ముహూర్తం ఫిక్స్ - ప్రధాని సిద్దం, తేల్చుడే..!!

జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చ తేదీని సోమవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చర్చ సమయంలోనే ఇండియా కూటమి లో భాగస్వామ్య పార్టీల లక్ష్యాల మొదలు మణిపూర్ ఘటనల పైన సమాధానం చెప్పేందుకు ప్రధాని సిద్దంగా ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అవిశ్వాసం పై చర్చ: లోక్ సభలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపైన విపక్ష పార్టీలు అవిశ్వాస నోటీసు ఇచ్చాయి. నోటీసు అందినట్లుగా ప్రకటించిన స్పీకర్ అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చించి సమయం ఖరారు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా.. ఈ నెల 31న అవిశ్వాసం పై చర్చ తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. మంగళవారం (ఆగస్టు 1) ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

The Debate on the no-confidence motion likely to be taken on 2nd August, will be decided on Monday

దీంతో వచ్చే బుధ, గురువారాల్లోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ, సమాధానం, ఓటింగ్‌కు అవకాశం ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు జరగను న్నాయి. ఆమోదం పొందాల్సిన కీలక బిల్లులు చాలానే ఉన్నాయి. వీటిలో అవిశ్వాస తీర్మానానికి తేదీ నిర్ణయం సహా ఢిల్లీ సర్వీసులకు సంబంధించిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు కీలకంగా మారుతోంది,

ఆగస్టు 2న చర్చించే ఛాన్స్: ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే సమావేశాలు ప్రభుత్వానికి చాలా కీలకమైనవి. ప్రతిపక్షాల తీరుచూస్తుంటే అత్యంత ఆసక్తిగా సాగే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఢిల్లీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాతే అవిశ్వాస తీర్మానానికి తేదీ నిర్ణయించాలని, అవిశ్వాసం నెగ్గిన వెంటనే పార్లమెంటును వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ రోజు నుంచి రెండు రోజుల పాటుగా ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు మణిపూర్ లో పర్యటించనున్నారు. నిజ నిర్దారణ కోసం వీరు పర్యటిస్తున్నట్లు ప్రకటించారు. అవిశ్వాసం పై చర్చ సమయంలో కేంద్రాన్ని నిలదీసేందుకు ఎవరు ఏ అంశాలను ప్రస్తావించాలనే దాని పైన ప్రతిపక్ష పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి.

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పైనా: ప్రధాని సైతం ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మెజార్టీ పరంగా బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే, మణిపూర్ అంశం పైన ప్రధానితో సమాధానం చెప్పించేందుకు అవిశ్వాస అస్త్రాన్ని ప్రతిపక్షం ప్రయోగించింది. అవిశ్వాసం పై చర్చ పూర్తయిన తరువాత ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదం పొందేలా చూసుకోవాల్సి ఉంది.

దీంతో, అవిశ్వాసం ముందే ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సమయం నుంచి ఇప్పటి వరకు మణిపూర్ అంశం పైనే గందరగోళం కొనసాగుతోంది. సోమవారం లోక్ సభలో అవిశ్వాసం పైన చర్చపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+