మంత్రికి నో ఎంట్రీ చెప్పిన సుప్రీం కోర్టు, తహసిల్దార్, ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే ?
బెంగళూరు/దారవాడ: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం జెండా ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు రెండు విడతల్లో ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సొంత నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా ఎమ్మెల్యే కావడం, తరువాత మంత్రి కూడా అయిన నాయకుడి అనుచరులు రెచ్చిపోతున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ధారవాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వినయ్ కులకర్ణి నియోజక వర్గంలో లేకపోవడంతో అధికారులు, ఏజెంట్లు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా తయారైయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ధారవాడ తహశీల్దార్ కార్యాలయంలో ఏ పని చేయాలన్నా అధికారుల చేతులు తడపాలని, లంచాలు ఇవ్వనిదే ఎవ్వరు ఏ పని చెయ్యడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల పనులు చేయించి డబ్బులు అందుకున్న ఏజెంట్లకు లంచాలు ఇవ్వలేని రైతులు సహనం కోల్పోయి కొట్టడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.
తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలోనే మంత్రి అనుచరులను రైతలు కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది. పహాణీ లేఖలో ప్రభుత్వం నమోదు చేసిన దృష్ట్యా ధారవాడ తాలూకాలోని శిబరగట్టి రైతులు మంత్రి వినయ్ కులకర్ణితో పాటు సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో ఫిర్యాదులు చేసినా అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

అధికారులు చేతులు దులుపుకుంటేనే పనులు జరుగుతున్నాయని రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తహసిల్దార్ రమేష్ బండి ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్న రైతులు అదే తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసిల్దార్ రమేష్ బండిని నిలదీశారు.
ప్రజాప్రతినిధులు, అధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వకపోవడమే దీనంతటికీ కారణమని తహసిల్దార్ ఆరోపిస్తున్నారు. తహసిల్దార్ రమేష్ బండి ఏజెంట్లతో కలిసి పనిచేస్తున్నాడని, ఎవరూ చెప్పినా మాట వినడం లేదని రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు. ధారవాడ రైతులు ఏకంగా మంత్రి వినయ్ కులకర్ణి మీద ఆరోపణలు చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

వాణిజ్య నగరమైన హుబ్బళిలోని గదగ్ రోడ్డు వెంబడి అక్రమంగా నిర్వహిస్తున్న 23 దాబా దుకాణాలను కార్పొరేషన్ అధికారులు ఆపరేషన్ ద్వారా తొలగించారు. 25 మంది కార్మికులు రెండు జేసీబీలు, నాలుగు ట్రాక్టర్లతో దుకాణాలను తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మూడు, నాలుగేళ్లుగా కొందరు రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై దాబా దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. ఖాళీ చేయాలని ఎన్నిసార్లు సూచించినా వినలేదు. ఈ నేపథ్యంలో జోన్ ఆఫీస్ 6 అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించినట్లు కార్పొరేషన్ ప్రజాసంబంధాల అధికారి ఎస్.సి. బేవూరు సమాచారం అందించారు. కార్పొరేషన్ డెవలప్‌మెంట్ అధికారులు, ఇంజినీర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications