Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జామున్ లో విషం కలిపి కూతుర్లకు తినిపించిన తండ్రి, భార్య చేసిన పనికి !

బెంగళూరు/రామనగర: కర్ణాటకలోని పట్టునాడు రామనగర్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి అతని ఇద్దరు పిల్లలకు జామూన్‌లో విషం కలిపి తినిపించాడు. కూతుర్లకు విషం పెట్టిన తరువాత అతను విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని రామనగరలో చోటుచేసుకుంది.

విషం తాగిన పిల్లలు నరకం అనుభవిస్తూ ప్రాణాలతో పోరాడుతున్న విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరుకు పొరుగు జిల్లా అయిన పట్టునాడు రామనగర్ జిల్లా ప్రజలకు పనులకు, కూలీ పనులకు ఎలాంటి కొరత లేదు.

The father tried to kill his daughters by mixing poison in jamun near Bengaluru.

ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగరీత్యా రైళ్లు, బస్సుల్లో బెంగళూరుకు వచ్చి హ్యాపీగా పనులు చేసుకుని తరువాత రామనగరకు వెళ్లి హాయిగా జీవనం గడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కుమారస్వామి సీఎం అయిన తరువాత రామనగర ను జిల్లా కేంద్రం చెయ్యడంతో అక్కడ విపరీతంగా ఫ్యాక్టరీలు కట్టారు..

అయితే కుటుంబ కలహాలతో మరణాల కేసులు ఎప్పటికప్పుడు నమోదవుతూనే ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి అతని ఇద్దరు పిల్లలకు జామూన్‌లో విషం కలిపి చంపేందుకు ప్రయత్నించాడు. అనంతరం విషం కలిపిన జామూన్‌ అతను తినేసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ముగ్గురూ ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్న విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించారు.

The father tried to kill his daughters by mixing poison in jamun near Bengaluru.
రామనగర్ తాలూకాలోని కసాపురా గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన కుమార్ (35) విషం తాగాడు. తర్వాత పిల్లలకు విషం తాగించగా, చేదుగా ఉండడంతో తాగేందుకు ఇద్దరు పిల్లలు నిరాకరించారు. అనంతరం ఇంట్లో ఉన్న జామూన్‌ తీసుకుని అందులో విషం కలిపాడు. ఆ తర్వాత కుమార్ అతని ఇద్దరు పిల్లలు వందన (4), తనుశ్రీ (3)లకు జామూన్ తినిపించాడు.

ఘటనానంతరం ముగ్గురిని రామనగర జిల్లా ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. రామనగరలో ప్రాథమిక చికిత్స అనంతరం ముగ్గురినీ బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రామనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగడంతో పోలీసులకు సమాచారం అందింది. కుమార్ అతని భార్య మీద అనుమానంతో అతని ఇద్దరు కూతుర్లు వందన, తనుశ్రీని హత్య చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+