డిజిటల్ పేమెంట్స్‌పై సర్వీస్ ఛార్జ్: క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల కాలం నడుస్తోంది. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లోనూ నగదు రహిత లావాదేవీలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. చిరు వ్యాపారులు సైతం వీటి మీదే ఆధారపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం దీనికి ఓ కారణం. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితులు కూడా నగదు రహిత లావాదేవీలు భారీగా పెరగడానికి కారణం అయ్యాయి.

యూపీఐ మీద..
డిజిటల్ చెల్లింపుల్లో పేటీఎం, ఫోన్ పే, మొబిక్విక్, యూపీఐ వినియోగం అధికంగా ఉంటోంది. నిత్యం లక్షలాది లావాదేవీలు వీటి ద్వారానే నమోదవుతున్నాయి. కొత్తగా వీటిని వినియోగించే వారి సంఖ్య సైతం రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవల మీద ప్రత్యేకంగా సర్వీస్ ఛార్జీలను వసూలు చేయాలని ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయి.

సర్వీస్ ఛార్జ్..
నిజానికి- యూపీఐ చెల్లింపుల మీద ఎలాంటి సర్వీస్ ఛార్జీలను వసూలు చేయకూడదంటూ 2020 జనవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనికి భిన్నంగా సర్వీస్ ఛార్జీలను అమలు చేయడానికి ముహూర్తం కూడా పెట్టిందనే ప్రచారం జోరుగా సాగింది. దసరా నుంచి యూపీఐ ద్వారా నిర్వహించే డిజిటల్ చెల్లింపులు భారంగా మారుతాయని, వాటిపై సర్వీస్ ఛార్జ్/లెవీ/సెస్‌ను వసూలు చేసేలా నిర్మల సీతారామన్ సారథ్యాన్ని వహిస్తోన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను రూపొందించిందంటూ విస్తృతంగా కథనాలు వెలువడ్డాయి.

ఐఎంపీఎస్ తరహాలో వ్యవస్థ
ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు, ఆహార వస్తువులను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో- ఈ భారం కూడా మోయక తప్పదనే ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమైంది. దీనికి కారణాలు లేకపోలేదు. బ్యాంకింగ్ వ్యవస్థలో అందుబాటులో ఉన్న ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) తరహాదే కావడం, వాటిపై సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తోన్నందున- యూపీఐ చెల్లింపులపైనా అమలు చేయాల్సి ఉంటుందంటూ ఈ మధ్యే రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది.

కేంద్రం క్లారిటీ..
దీనికి సంబంధించిన డిస్కషన్ పేపర్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించింది. సర్వీస్ ఛార్జీలను అమలు చేయడాన్ని పరిశీలించాలని సూచించింది. ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. యూపీఐ ద్వారా నిర్వహించే చెల్లింపులపై సర్వీస్ ఛార్జీలను గానీ లెవీని గానీ విధించట్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి అవి ఉచితమేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ మీద ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని క్లారిటీ ఇచ్చింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications