దేశంలో అత్యంత ఎత్తైన రావణుడి దిష్టిబొమ్మ.. ఎక్కడుందో..ఎన్ని అడుగులో తెలుసా..?
ఈ ఏడాది దసరాను దేశవ్యాప్తంగా అక్టోబర్ 24న ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా డెహ్రాడూన్‌లోని చారిత్రాత్మక పరేడ్ గ్రౌండ్‌లో అక్టోబర్ 24న రావణ దహనం జరగనుంది. ఇందుకోసం డెహ్రాడూన్‌లో సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈసారి, ఇక్కడ 131 అడుగుల ఎత్తు ఉన్న డూన్‌లో అత్యంత ఎత్తైన దిష్టిబొమ్మను సిద్ధం చేయనున్నారు. ఈ దిష్టిబొమ్మ పర్యావరణ అనుకూలమైనది. అంతేకాకుండా తక్కువ పటాకులు ఉపయోగించబడినది కూడా. దీని ఖరీదు సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుంది. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఐదుసార్లు రికార్డులు సృష్టించిన హస్తకళాకారుడు తేజిందర్ చౌహాన్, అతని బృందం ఈ దిష్టిబొమ్మను తయారీ చేశారు.
లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో...:లంకా దహన కార్యక్రమ నిర్వాహకులుగా బన్ను బిరాదారి వ్యవరిస్తారు. అయితే, బన్ను బిరాదారి గురించి సంతోష్ సింగ్ నాగ్‌పాల్ మాట్లాడుతూ 75 ఏళ్లుగా బన్నూ సోదరులు దసరా పండుగ సందర్భంగా లంకా దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి ప్రోగ్రామ్ మరింత పెద్దదిగా ఉంటుందని తెలిపారు. ఎందుకంటే ఈసారి ప్రపంచ రికార్డ్ హోల్డర్ క్రాప్టమెన్ తేజిందర్ చౌహాన్ చేతుల మీదుగా రావణుడి దిష్టిబొమ్మకు ప్రాణం పోయడం జరుగుతుంది. తేజిందర్ చౌహాన్ 2019లో భారతదేశంలోని సుమారు 221 అడుగుల ఎత్తయిన భారీ రావణుడి దిష్టిబొమ్మను తయారుచేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు. ఈ దిష్టిబొమ్మకు కావలసిన రా మెటీరీయల్ అంతా అంబలా నుంచి తెప్పించుకున్నామని, కేవలం ఈ బొమ్మకు కావలసిన స్పేర్ ఫాట్స్ మాతం డెహ్రడూన్‌లో తీసుకున్నాని చెబుతున్నాడు చౌహాన్.

రూ. 12 లక్షల నుంచి 13 లక్షలు ఖర్చు..:దేశంలోనే అత్యంత ఎత్తైన దిష్టిబొమ్మను ఇంతకుముందు కూడా డెహ్రాడూన్‌లోనే దహనం చేశామని శిల్పి తేజిందర్ తెలిపారు. అయితే, ఈ సారి తయారు చేసిన బొమ్మకు సుమారు మూడు నెలల సమయం పట్టిందని.. లంక, కుంభకర్ణ, మేఘనాదుల దిష్టిబొమ్మతో కలిపి 12లక్షల రూపాయల నుంచి 13 లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని ఆయన అన్నారు. గత మూడు నెలలుగా తేజిందర్ చౌహాన్‌తో కలిసి 25 మంది బృందం ఎంతో తీవ్రంగా శ్రమిస్తోంది. డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో పచ్చదనం దెబ్బతినకుండా ఉండేందుకు, దిష్టిబొమ్మలో ఎక్కువ పటాకులు వాడకుండా, పర్యావరణ అనుకూలమైన బాణసంచా మాత్రమే ఉపయోగించాలని సంతోష్ నాగ్‌పాల్ చెప్పారు. దసరా ఏర్పాట్లపై నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నామని, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగంతో పాటు సంస్థలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. ఈ దిష్టిబొమ్మ ఇక్కడికి వచ్చే చూపరులను ఆకర్షించేందుకు, ఈ ఉత్సవాల ద్వారా '..బేటీ బచావో, బేటీ పఢావో' కార్యక్రమాన్ని కూడా ప్రచారం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. బాలికల హాస్టళ్లకు విరాళాలు అందించే కార్యక్రమాలను కూడా దీని ద్వారా నిర్వహిస్తున్నామని కమిటీ అధ్యక్షుడు సంతోష్ తెలిపారు.












Click it and Unblock the Notifications