Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భార్య మీద కసి, అత్తారింటి మూడో అంతస్తు మీద నుంచి బిడ్డను విసిరేసి దూకేసిన భర్త !

న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా భార్య కాని, భర్త కాని రాజీకాలేకపోయారు. భార్య ఎక్కువ టార్చర్ పెడుతోందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. భార్యతో గొడవపడిన భర్త అతని రెండు ఏళ్ల బిడ్డను మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేశారు.

 ఇద్దరు పిల్లలు

ఇద్దరు పిల్లలు

దేశ రాజధాని ఢిల్లీలోని కల్మాజీ ఏరియాలో పూజా అనే మహిళ నివాసం ఉంటున్నది. అదే ఏరియాలో మాన్ సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మాన్ సింగ్, పాజాకు వివాహం అయ్యింది. సంతోషంగా కాపురం చేసిన మాన్ సింగ్, పూజా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పిల్లలు పుట్టిన తరువాత పూజా, మాన్ సింగ్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇరు వైపుల కుటంబ సభ్యులు, కుల పెద్దలు పంచాయితీలు చేశారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల పూజా ఆమె ఇద్దరు పిల్లలను పిలుచుకుని కల్మాజీ ఏరియాలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

 భర్త ఫోన్ చేసినా పట్టించుకోలేదు

భర్త ఫోన్ చేసినా పట్టించుకోలేదు

భార్య పూజా, పిల్లలను ఇంటికి పిలుచుకుని రావాలని మాన్ సింగ్ ప్రయత్నించాడు. ప్రతిరోజు భార్య పూజాకు ఫోన్ చేస్తున్న మాన్ సింగ్ పిల్లలను పిలుచుకుని రావాలని చెబుతున్నాడు. చివరికి పూజా ఆమె భర్త మాన్ సింగ్ ఫోన్ కాల్స్ రిసీవ్ చెయ్యడం మానేసింది. భార్య పూజా తీరుతో విసిగిపోయిన మాన్ సింగ్ అతని అత్తారింటికి వెళ్లాడు.

 అత్తారింటిలో రచ్చరచ్చ

అత్తారింటిలో రచ్చరచ్చ

నీతో ఇంటికి రాను అని పూజా ఆమె భర్తకు తేల్చి చెప్పింది. ఆ సందర్బంలో ఇద్దరి మద్య పెద్ద గొడవ జరిగింది. సహనం కోల్పోయిన మాన్ సింగ్ అతని రెండు సంవత్సరాల బిడ్డను ఎత్తుకుని పూజా కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న భవనంలోని మూడో అంతస్తు మీదకు వెళ్లి అక్కడి నుంచి బిడ్డను విసిరేసిన మాన్ సింగ్ అతనూ అక్కడి నుంచి దూకేశాడు.

 భార్య తీరుతో విసిగిపోయిన భర్త

భార్య తీరుతో విసిగిపోయిన భర్త

తీవ్రగాయాలైన మాన్ సింగ్, అతని బిడ్డను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించామని, ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. భార్య పూజా మీద కోపంతో మాన్ సింగ్ అతని రెండు సంవత్సరాల బిడ్డను హత్య చెయ్యడానికి ప్రయత్నించి అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం ఢిల్లీలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+