భార్యతో ఫ్రెండ్ అక్రమ సంబంధం, ముక్కలు నరికేసి బ్యాగ్ లో ప్యాక్ చేసి, భర్త స్కెచ్ కు ?
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ హత్య కేసు వెలుగు చూసింది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడిని హత్య చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేవాడు. తెలిసిన వ్యక్తి అతని ఇంట్లోనే ఓ యువకుడని దారుణంగా చంపి, శరీరభాగాల్ని ముక్కలుగా నరికేసి ఆ శరీర భాగాలను సంచిలో నింపి కల్వర్టులో పడేశాడు.
మృత దేహం కోసం చాలా రోజులుగా అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత నిపుణులు వెతికినా ఇంత వరకు ఆచూకీ లభించలేదు. ఈ ఘటన బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.హత్యకు గురైన వ్యక్తిని కేవీ శ్రీనాథ్ (34)గా గుర్తించారు. మాధవరావు అనే వ్యక్తి అతని స్నేహితుడు శ్రీనాథ్ ను హత్య చేశాడని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

బెంగళూరులోని సంపిగేహళ్లి పోలీసులు కొన్ని రోజుల తర్వాత శ్రీనాథ్ హత్య మిస్టరీని ఛేదించారు.హత్యకు గురైన శ్రీనాథ్ బెంగళూరులోని ధణిసంద్రలోని అంజనాద్రి లేఅవుట్‌లో అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. బెంగళూరులోని బసవేశ్వరనగర్‌లోని ఓ చిట్‌ఫండ్‌లో శ్రీనాథ్ డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనాథ్ తరువాత ఇంటికి తిరిగి రాలేదు. శ్రీనాథ్ అదృశ్యంపై అతని భార్య సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసుల విచారణలో కేఆర్‌పురం సమీపంలోని విజినాపురలోని మాధవరావు ఇంటికి శ్రీనాథ్ వెళ్లినట్లు తేలింది. మాధవరావు ఇంటికి శ్రీనాథ్ వచ్చినట్లు ఇంట్లోని సీసీటీవీలల్లో గుర్తించారు. అయితే మాధవరావు ఇంటి నుంచి శ్రీనాథ్ బయటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజీలలో మాత్రం లేవు. అనుమానం వచ్చి మాధవరావు ఇంటిని తనిఖీ చేయగా రక్తపు మరకలు కనిపించాయి. ఆ తర్వాత మాధవరావు గురించి ఆరా తీయగా అతను కూడా కనిపించకుండా పోయాడని పోలీసు అధికారులు తెలిపారు.

నిందితుడు మాధవరావు-అతని స్నేహితుడు శ్రీనాథ్ ను హత్య చేశాడని పోలీసులు నిర్దారించారు అనంతరం మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా మాధవరావు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో అసలు విషయాన్ని బయటపెట్టిన మాధవరావు అతని స్నేహితుడు శ్రీనాథ్ ను ఎందుకు హత్య చేశానే అనే విషయం గురించి పోలీసులకు చెప్పాడు.
తన భార్యతో శ్రీనాథ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అందుకే అతన్ని చంపేశానని
మాధవరావు పోలీసులకు చెప్పాడు, శ్రీనాథ్, మాధవరావుకు ఒకరికొకరు రెండేళ్లుగా తెలుసు. శ్రీనాథ్ దగ్గర మాధవరావు రూ.5 లక్షల చీటీ వేశాడు. ఇదే చీటీ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీనాథ్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అందుకే నిత్యం తనతో మాట్లాడే నెపంతో తన ఇంటికి వస్తున్నాడని మాధవరావు అనుమానం పెంచుకున్నాడు.
శ్రీనాథ్ అతని ఇంటి నుంచి బయలుదేరిన తరువాత నేరుగా మాదవరావు ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో డబ్బుల విషయంలో, భార్య అక్రమ సంబంధం విషయంలోనే మాధవరావు ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మాధవరావు సహనం కోల్పోయి అతని ఇంట్లో ఉన్న జాక్ రాడ్‌తో శ్రీనాథ్ తలపై మోదాడు. అనంతరం కొడవలితో శ్రీనాథ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు.

సాక్షాలను నాశనం చేసేందుకు శ్రీనాథ్ మృతదేహాన్ని ముక్కలు చేసి ఆ శరీర భాగాలను రెండు ప్లాస్టిక్ సంచుల్లో నింపి బేలత్తూరు కల్వర్టులో పడేశాడు. అనంతరం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన మాధవరావు బస్సులో ఆంధ్రాకు పరారయ్యాడు.
కేసును రామమూర్తినగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి హత్య, సాక్ష్యాలు ధ్వంసం చేశాడని మాధవరావు మీద అనేక సెక్షల కింద కేసు నమోదు చేశారు. కొన్ని రోజులుగా శ్రీనాథ్ మృతదేహంలోని భాగాల కోసం పోలీసులు గాలించారు. మంగళూరు నుంచి నిపుణులను పిలిపించి పోలీసులు డ్రైనేజ్ లో సోదాలు చేసి శ్రీనాథ్ శరీరంలోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications