Wife: శాడిస్టు మొగుడు, శ్మశానంలో క్షుద్రపూజలు, పుర్రెలు తినిపిస్తే పిల్లలు పుడుతారని ? !

ముంబాయి/థాణే: యువతికి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో వివాహం జరిపించారు. వివాహం చేసుకున్న భర్త కొంతకాలం మాత్రమే ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు. తరువాత భార్యకు ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు నరకం చూపించారు. వివాహం జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నా నువ్వు తల్లివి కాలేదని, నీకు ఏదో లోపం ఉందని భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు నరకం చూపించారు. భర్త కుటుంబ సభ్యులు క్షుద్రపూజలు, చేతబడులను నమ్ముతారు. నరబలి, చేతబడి చేసే ఓ మాత్రికుడిని వెంటపెట్టుకుని ఆమెను శ్మశానంలోకి లాక్కెళ్లి అక్కడ కుర్చోబెట్టి తల మీద రివాల్వర్ గురి పెట్టి ఆమెతో శ్మశానంలోని అస్తిపంజరాల ఎముకలు తినింపించి ఆమెకు నరకం చూపించారు.

 నివేదిక ఇవ్వండి

నివేదిక ఇవ్వండి

మూఢనమ్మకాలు, చేతబడులు, నరబలికి సంబంధించిన సంఘటనలు ఇటీవలి కాలంలో చాలా రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్నాయి. మూడనమ్మకాలకు సంబంధించిన సంఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. మహిళ భర్త, అతని కుటుంబ సభ్యులు చేసిన పనికి మహారాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు. మహారాష్ట్ర మహిళ కమిషనర చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే నివేదిక సమర్పించాలని పూణే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 నాలుగేళ్ల క్రితం పెళ్లి

నాలుగేళ్ల క్రితం పెళ్లి

పూణేలో నివసిస్తున్న 29 ఏళ్ల యువతికి 2019లో పెళ్లి చేసుకుంది. మహిళ భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వివాహం జరిగిన తరువాత మహిళకు ఆమె భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెపై వేధింపులకు దిగారు. మహిళకు పెళ్లయిన మరుసటి సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా భర్త కుటుంబం అనేక విధాలుగా ఆర్థికంగా నష్టపోయిందని తెలిసింది. దీంతో భర్త కుటుంబ సభ్యులు మహిళ నుంచి కట్నం డబ్బులు ఇవ్వాలని మహిళను వేధించి నగలు, డబ్బు లాక్కొన్నారు. రానురాను ఆ మహిళ మీద భర్త కుటుంబీకులు ప్రతాపం చూపించారని తెలిసింది.

 చేతబడిని నమ్ముతున్న ఫ్యామిలీ

చేతబడిని నమ్ముతున్న ఫ్యామిలీ

మహిళ భర్త కుటుంబ సభ్యులు చేతబడిని నమ్ముతారు. వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా మహిళ గర్భం దాల్చకపోవడంతో ఇంట్లో వారు ఆమెకు మాయమాటలు చెప్పడం ప్రారంభించారు. ఓ మంత్రగాడిని సంప్రధించి ఇంటికి పిలుచుకుని వెళ్లి మనిషి ఎముకలతో క్షుద్ర పూజలు చేశారు. తరువాత ఇంట్లో ఏవేవో పూజలు చేస్తూ ఆమెను భయభ్రాంతులకు గురి చేశారు.

 శ్మశానంలో ఏం చేశారంటే ?

శ్మశానంలో ఏం చేశారంటే ?

నరబలి, చేతబడి చేసే ఓ మాత్రికుడిని వెంటపెట్టుకుని ఆమెను శ్మశానంలోకి లాక్కెళ్లాడు. శ్మశానంలో ఆమెను కుర్చోబెట్టి ఎముకలు తినాలని చెప్పారు. మనిషి ఎముకలు పిండి చేసి ఆమెతో బలవంతంగా తినిపించాలని ప్రయత్నించారు, మనిషి ఎమకులు తినడానికి ఆమె నిరాకరించింది. ఆ సమయంలో నిందితులు మహిళ తల మీద రివాల్వర్ గురి పెట్టి ఆమెతో శ్మశానంలోని అస్తిపంజరాల ఎముకలు తినింపించారు. ఇలా పలుమార్లు ఆమె మీద దారుణానికి పాల్పడ్డారాని తెలిసింది.

 కేసు పెట్టిన బాధితురాలు

కేసు పెట్టిన బాధితురాలు

రానురాను చిత్రహింసలు తట్టుకోలేక మహిళ ఆమె భర్తకు ఎదురు తిరగడం మొదలుపెట్టింది. దీంతో రెచ్చిపోయిన భర్త, అతని కుటుంబ సభ్యులు గత ఏడాది మేలో ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. అప్పటి నుంచి బాధితురాలు పుట్టింటిలోనే ఉంటున్నది, భర్త ఫోన్లు చేసి ఆమెను ఇంటికి రావాలని టార్చర్ పెట్టాడు. దీంతో బాధితుతరాలు మహారాష్ట్ర మహిళ మహిళా కమిషన్‌కు, పూణే సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 8 మంది మీద కేసులు పెట్టిన పోలీసులు

8 మంది మీద కేసులు పెట్టిన పోలీసులు

మహిళ భర్త, ఆమె బంధువులు, మాంత్రికుడితో సహ మొత్తం ఎనిమిది మంది మీద కేసులు నమోదు చేశారు. అందరినీ త్వరలోనే పట్టుకుంటామని పూణే సిటీ పోలీసులు బాధితురాలికి హామీ ఇచ్చారు. మహారాష్ట్ర మహిళ కమిషనర చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే నివేదిక సమర్పించాలని పూణే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+