ఆందోళన వద్దు- రాజధానికి రావద్దు : ఉక్రెయిన్ లోని భారతీయులకు ఎంబసీ సూచన..!!
ఉక్రెయిన్ పైన రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ సేనలు తిప్పి కొడుతున్నాయి. యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్ లోని భారతీయలకు అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. దాదాపు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నట్లుగా అంచనా వేస్తున్నాయి. చేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లో వేరే ప్రదేశాలకు వెళ్లొద్దని కోరింది. "ఉక్రెయిన్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాయబార వర్గాలు పేర్కొన్నాయి.
Recommended Video
రాయబార కార్యాలయం సూచన
హాస్టళ్లు, ఇళ్లు, వసతి గృహాలు ఇలా ఎక్కడున్నవారు అక్కడే సురక్షితంగా ఉండండి. పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాల నుంచి రాజధాని కీవ్‌కు బయల్దేరిన వారు తిరిగి మీ ప్రాంతాలకు తాత్కాలికంగా వెళ్లిపోండి" అని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ ట్వీట్ చేసింది. అలాగే తదుపరి ఎదైనా సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని రాయబార కార్యాలయం పేర్కొంది. త్వరితగతిన మారిపోతున్న పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ ఎయిర్‌బేస్‌లను, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది.

దాడులు..విమానాల కూల్చివేతలు
మరోవైపు, రష్యాకు చెందిన ఐదు విమానాలను లుహాన్స్క్ ప్రాంతంలో కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. ఓ హెలికాప్టర్‌ను సైతం నేలకూల్చినట్లు వెల్లడించింది. రష్యా సైన్యంఉక్రెయిన్లోకి రష్యా సైన్యం చొరబడింది. బెలారస్ నుంచి రష్యా దళాలు దేశంలోకి ప్రవేశించాయని ఉక్రెయిన్ సరిహద్దు రక్షణ ఏజెన్సీ ప్రకటించింది. అయితే, తాము జనావాసాలను లక్ష్యంగా చేసుకోలదని రష్యా అధ్యక్షుడు వెల్లడించారు. సైనిక స్థావరాలపైనే దాడులు సాగుతున్నాయని చెప్పుకొచ్చారు.

భారత ప్రభుత్వం అప్రమత్తం
ఉక్రెయిన్ స్వాధీనం తమ లక్ష్యం కాదన్నారు. రష్యా నిర్ణయం పైన అటు అమెరికా..మిత్రపక్ష దేశాలు మండిపడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం నిర్వహణకు నిర్ణయించారు. ఇదే సమయంలో.. తమ వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. తమ దేశాన్ని తాము కాపాడుకుంటామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.












Click it and Unblock the Notifications