సీఎం కుర్చి ఖాళీగా ఉంది, పవర్ వేరేవాళ్ల చేతిలో, కలెక్షన్ ఏజెంట్లు ఎవరంటే ?, ఇది సీఎం కథ !
బెంగళూరు: కర్ఱాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా 135 మంది ఎమ్మెల్యేలను గెలిపింపుచున్న కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే మొదటి నుంచి సీఎం కుర్చీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి తయారైయ్యింది. తరువాత సీఎంగా సిద్దరామయ్య, డీసీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే సీఎం పదవి విషయంలో నిత్యం ఎవరో ఒక నాయకుడు కామెంట్ చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాల విషయంలో కర్ణాటకలోని ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ, జేడీఎస్ పార్టీలు సిద్దరామయ్య ప్రభుత్వంలోని అవినీతికి సంబంధించి అధికార పార్టీపై వరుస ఆరోపణలు చేయడం ఆ పార్టీ నాయకులకు మింగుడుపడటంలేదు.

కర్ణాటకలో ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అయిందని రాష్ట్ర బీజేపీ శనివారం ట్విట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో నామమాత్రపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని బీజేపీ ఎద్దేవ చేసింది. కర్ణాకటలో పనికిమాలిన సీఎం ఉన్నారని, అది కర్ణాటక దౌర్బాగ్యం అంటూ బీజేపీ మండిపడింది. సిద్దరామయ్య పేరుకు మాత్రమే సీఎంగా ఉన్నారని, ఆయన పవర్ మొత్తం వేరే వాళ్ల చేతిలో ఉందని బీజేపీ ట్వీట్ చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అబద్ధాన్ని నిజం చేస్తున్నారని, అలాంటి సిగ్గులేని ముఖ్యమంత్రి రావడం కర్ణాటక చేసుకున్న దౌర్భాగ్యం అంటూ బీజేపీ ఆరోపించింది. కర్ణాటకలో నిజాయిగా పని చేస్తున్న అధికారులను సిద్దరామయ్య ప్రభుత్వం ఎందుకు బదిలి చేస్తోందని బీజేపీ నిలదీసింది. కర్ణాటకలో షాడో సీఎంగా సిద్దరామయ్య పని చేస్తున్నారని, ఆయన పవర్ మొత్తం చాలా మంది చేతుల్లో ఉందని బీజేపీ ఆరోపించింది. సిద్దరామయ్య ప్రభుత్వం మీద బీజేపీ చేసిన ఆరోపణలు ఇలా ఉన్నాయి.

*. సిద్దరామయ్య గెలిచిన వరుణా నియోజక వర్గం ఆయన కుమారుడు యతీంద్ర చేతిలోకి వెళ్లిపోయింది.
*. సీఎం కుర్చీ ఎంజెంట్: సుర్జేవాలా
* కావేరి నీరు పంపకాల ఇన్ చార్జ్: ఎంకే స్టాలిన్
* సిద్దరామయ్య ప్రభుత్వంలో కలెక్షలు వసూలు చేస్తున్నది: కాంట్రాక్టర్లు
*. ఎలక్షన్ లకు డబ్బులు పంపిణ చేస్తున్న లీడర్: డీకే శివకుమార్. ఇలా బీజేపీ శనివారం సిద్దరామయ్య ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఆరోపణలు చెయ్యడం మొదలుపెట్టింది.












Click it and Unblock the Notifications