కేజీఎఫ్ సినిమా vs రాహుల్ గాంధీ, హైకోర్టులో షాక్, యువరాజు గ్రహాలు రివర్స్ !
బెంగళూరు/హైదరాబాద్: పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కేజీఎఫ్-2 సినిమాలోని మ్యూజిక్ ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సహా ముగ్గురు కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెడుతోంది. కేజీఎఫ్-2 పాటల మ్యూజిక్ కాపీరైట్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల దిమ్మతిరిగిపోయింది.
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహ ముగ్గురు కాంగ్రెస్ నేతలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు తీర్పుతో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలి విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. కేజీఎఫ్-2 పాటల మ్యూజిక్ ను అనుమతి లేకుండా ఉపయోగించారని ఎంఆర్ టీ మ్యూజిక్ సంస్థ కోర్టుకు ఫిర్యాదు చేసింది.

ఎంఆర్‌టి మ్యూజిక్ సంస్థ ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్, సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనాథే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసి తరువాత బుధవారం తీర్పు ప్రకటించింది.
కర్ణాటక హైకోర్టు కేజీఎఫ్-2 సినిమా పాటల హక్కులు ఎవరి సొంతం అంటూ ప్రశ్నించింది. దరఖాస్తుదారు సోర్స్ కోడ్‌ను తారుమారు చేశారని, కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని కేజీఎఫ్ సినిమా ఆడియోను సొంతం చేసుకున్న ఎంఆర్ టీ సంస్థ కోర్టుకు చెప్పింది. ఆడియో సంస్థ యొక్క కాపీరైట్స్ ను ఉల్లంఘించారని కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాలన్నింటిపై విచారణ జరిపి రాహుల్ గాంధీ సమర్పించిన పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ దెబ్బతో రాహుల్ గాంధీ అండ్ కో మీద నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది.

కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం కేజీఎఫ్-2 మ్యూజీక్ ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే, ఈ కేసులో అలాంటి ఉద్దేశం లేదని, కాపీరైట్ ఉల్లంఘన చేసి పిటిషనర్ ఎటువంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున న్యాయవాదులు కోర్టులో వాదించారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాద యాత్రలో కేజీఎఫ్-2 సినిమాలోని మ్యూజిక్ మార్మోగిపోయింది. కేజీఎఫ్ సినిమా పాటలకు సంబంధించి ఎలాంటి వీడియోను వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయలేదు. జైరామ్ రమేష్ గానీ, సుప్రియ గానీ కంటెంట్ క్రియేట్ చేయలేదు. ఈ కేసులో తాము కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు చెప్పలేమని రాహుల్ గాంధీ తరపున న్యాయవాదులు కర్ణాటక హైకోర్టులో చెప్పారు.
.
కేజీఎఫ్ చిత్రంలోని పాటను ఉపయోగించి పిటిషనర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని కేజీఎఫ్ సినిమా ఆడియో హక్కులు సొంతం చేసుకున్న ఎంఆర్ టీ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆడియో సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది వాదించారు. ఆడియో సోర్స్ కోడ్ తీసుకోబడింది, దానిపై వీడియో సూపర్మోస్ చేయబడిందని ఆడియో సంస్థ న్యాయవాది కోర్టుకు చెప్పారు.
కాపీరైట్ చట్టం ఉల్లంఘన, సివిల్, క్రిమినల్ సెక్షన్ ల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నియమాలు ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ కోర్టులో సివిల్ దావా వేసి నిలుపుదల ఉత్తర్వులు కూడా పొందినట్లు తెలిపారు. ఆడియో, వీడియో వినియోగంపై ఆ సంస్థకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కాపీ రైట్స్ ఉల్లంఘించారని, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎంఆర్ టీ సంస్థ ఆరోపించింది.

రాహుల్ గాంధీ న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఎలాంటి ఆర్థిక లాభాలు పొందనప్పటికీ మొత్తం ప్రక్రియ ద్వారా ప్రజాదరణ పొందారని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అందువలన రాహుల్ గాంధీ తదితరులు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చెయ్యాలని వేసిన పిటిషన్ కు కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలతో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ అయ్యారు.
ఇప్పుడు రాహుల్ గాంధీతో పాటు మిగిలిన నాయకులు కేజీఎఫ్-2 సినిమా మ్యూజిక్ విషయంలో మరో కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చెయ్యాల్సి ఉంది. కర్ణాటకలో భారత్ జూడో యాత్ర ముగించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా రాహుల్ గాంధీ వెలుతున్న సమయంలోనే ఈ కేసు బెంగళూరులో నమోదు అయ్యింది. కేజీఎఫ్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.












Click it and Unblock the Notifications