షాక్: బెంగళూరు ఇంజనీరింగ్ విద్యార్థి ఇంటి వార్డ్ రోబ్ లో మహిళ మృతదేహం !

బెంగళూరు నగరంలో ఇంజనీరింగ్ విద్యార్థి నివాసం ఉంటున్న ఇంటి వార్డ్ రోబ్ లో మహిళ కుళ్లిపోయిన శవం గుర్తించిన పోలీసులు షాక్ కు గురైనారు. విద్యార్థితో సహ మరో మహిళ మాయం కావడంతో పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు

బెంగళూరు: బెంగళూరు నగరంలో ఇంజనీరింగ్ విద్యార్థి నివాసం ఉంటున్న ఇంటి వార్డ్ రోబ్ లో మహిళ కుళ్లిపోయిన శవం గుర్తించిన పోలీసులు షాక్ కు గురైనారు. విద్యార్థితో సహ మరో మహిళ మాయం కావడంతో పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సంజయ్ బెంగళూరులోని కంగేరీ సమీపంలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్న నవీన్ అనే వ్యక్తిని గత ఏడాది ఏప్రిల్ లో కలిశాడు. తనకు ఇంటిని అద్దెకు ఇవ్వాలని నవీన్ కు చెప్పాడు. గాంధీనగర్ లోని శాటిలైట్ టౌన్ షిప్ లో ఉన్న ఇంటిని సంజయ్ కు అద్దెకు ఇచ్చాడు.

The Kengeri police found the skeletal remains of a woman buried in a wardrobe

సంజయ్ తన తల్లి శశికళ, అవ్వ శాంతకుమారితో కలిసి గత ఏడాది ఏప్రిల్ నుంచి అద్దె ఇంటిలో ఉంటున్నాడు. అయితే గత ఫిబ్రవరి నెల నుంచి ఇంటిలో ఎవ్వరూ లేకపోవడం, అద్దె ఇవ్వకపోవడంతో ఇంటి యజమాని నవీన్ కంగేరీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు.

ఇంటిలోని వార్డ్ రోబ్ కు పెద్ద ప్లాస్టర్ వేసి ఉన్న విషయం గుర్తించి దానిని తొలగించి చూశారు. వార్డ్ రోబ్ లో మహిళ కుళ్లిపోయిన శవం గుర్తించారు. గత ఫిబ్రవరి నెలలో తనకు అత్యవసరంగా రూ. 50 వేలు కావాలని, మా అవ్వ తీర్థయాత్రకులు వెళ్లారని, ఆమె వచ్చిన తరువాత తిరిగి చెల్లిస్తానని చెప్పిన సంజయ్ అడ్వాన్స్ గా ఇచ్చిన సొమ్ములో రూ. 50 వేలు తీసుకుని వెళ్లాడని ఇంటి యజమాని నవీన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

తరువాత ఇంటిలో ఉన్న వారు ఎవ్వరూ కనపడలేదని నవీన్ పోలీసులకు చెప్పాడు. ఇంటిలో స్వాధీనం చేసుకున్న మహిళ మృతదేహం శాంతకుమారిదా లేక ఆమె కుమార్తె శశికళ (సంజయ్ తల్లి) దా అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. మాయం అయిన సంజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+