ఎలక్షన్ టైమ్ లో లేడీ కార్పోరేటర్ భర్తను పట్టపగలు ఏసేశారు, రివాల్వర్లతో ఫైరింగ్ !
బెంగళూరు/విజయపుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన జరగనుంది. ఎన్నికల పోలింగ్ కేవలం 4 రోజుల మాత్రమే ఉంది. ఓ జాతీయ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న కార్పోరేటర్ భర్తను పట్టపగలు దారుణంగా చంపేశారు. రివాల్వర్లతో ఒక్కసారిగా చుట్టుముట్టిన ప్రత్యర్థులు అతన్ని స్పాట్ లో చంపేసి వెళ్లిపోయారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. శనివారం బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ, హుబ్బళిలో సోనియా గాంధీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్. చిక్కమగళూరులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వివిద జిల్లాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు.

కర్ణాటకలోని హాట్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయపుర నియోజక వర్గం కూడా ఒక్కటి. విజయపుర మహా నగర పాలికె వార్డు నెంబర్ 18 నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా హైదర్ ఆలీ నదాఫ్ అలియాస్ హైదర్ ఆలీ భార్య నిశాత్ ను గత కార్పోరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కార్పోరేటర్ గా విజయం సాధించారు. విజయపురలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఇంతకాలం నేరుగా పోటాపోటీ ఉంది.
స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా భార్య నిశాత్ ను గెలిపించుకున్న హైదర్ ఆలీ సామాన్యుడు కాదు. హైదర్ ఆలీ పెద్ద రౌడీషీటర్, విజయపుర మహానగర పాలికెలో గతంలో హైదర్ ఆలీకి టిక్కెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. అనేక క్రిమినల్ కేసులు ఉన్న హైదర్ ఆలీ ఎన్నికల్లో పోటీ చెయ్యలేకపోవడంతో అతని భార్య నిశాత్ ను గత కార్పోరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా గెలిపించుకున్నాడు.

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో హైదర్ ఆలీ. అతని భార్య, కార్పోరేటర్ నిశాత్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం ఎన్నికల ప్రచారం చెయ్యడానికి బయలుదేరిన రౌడీషీటర్ హైదర్ ఆలీని నడిరోడ్డు మీద రివాల్వర్లతో కాల్చి చంపేశారు. రాజకీయ విభేదాల కారణంగా రౌడీషీటర్ హైదర్ ఆలీని హత్య చేశారా ?, లేదా రౌడీషీటర్ల వర్గపోరుతో ఇతను హత్యకు గురైనాడా ? అని ఆరా తీస్తున్నామని విజయపుర సిటీ పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications