మోదీ మాస్టర్ ప్లాన్, బెంగళూరులో సర్వే, ఇక్కడ వదిలేసి అక్కడ తీసుకోవాలని స్కెచ్, సుమలత కోసం !
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పార్టీల పొత్తు నేపథ్యంలో ఉత్కంఠ రేపుతున్నాయి. రెండు పార్టీలు ఎన్ని సీట్లు పంచుకుంటాయి?, అవి ఏమిటి? అనేది రోజురోజుకు మారిపోతున్నాయి. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. 19 సీట్లు మాత్రమే గెలుచుకున్న జేడీఎస్ ఎన్నికల తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించింది.
ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జేడీఎస్‌లు సీట్లు పంచుకోవడం ద్వారా ఎన్నికలను ఎదుర్కోనున్నాయి. కాంగ్రెస్ ను కట్టడి చేయడానికే పొత్తు అని బీజేపీ, జేడీఎస్ పార్టీలు చెబుతున్నాయి. పొత్తు చర్చల ప్రకారం జేడీఎస్ 5 సీట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే నాలుగు సీట్లు ఇవ్వడానికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో రెండు లోక్ సభ నియోజక వర్గాలను వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైనట్లు సమాచారం. ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత సీట్ల కేటాయింపుపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

జేడీఎస్‌కు కేటాయించిన సీట్ల జాబితాలో బెంగళూరు ఉత్తర (నార్త్) కూడా ఇప్పుడు తెరమీదకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగుళూరు ఉత్తర నియోజకవర్గం నుండి బీజేపీకి చెందిన ప్రస్తుత ఎంపీ డీవీ సదానంద గౌడ ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయను అని ఇప్పటికే ప్రకటించారు. అయితే డీవీ సదానంద గౌడతో చర్చలు సాగాయని తెలిసింది. ఈ సమయంలోనే బెంగళూరు నార్త్‌కు బీజేపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దించనుందనే ప్రచారం సాగింది.
ఒక్కలిగ కులం ప్రభావం ఎక్కువగా ఉన్న బెంగళూరు ఉత్తర నియోజకవర్గానికి మాజీ మంత్రి సీటీ రవి (ఉడిపి-చిక్కమగళూరు సిట్టింగ్ ఎంపీ), కేంద్రమంత్రి శోభా కరంద్లాజే పేరు వినిపించింది. ప్రస్తుత సమాచారం ప్రకారం లోక్ సభ నియోజకవర్గం మారేందుకు శోభా కరంద్లాజే అంగీకరించలేదని బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు అంటున్నారు. ఇక సీటీ రవి బెంగళూరుకు రావడానికి స్థానిక నేతలు అంగీకరించడం లేదని కొందరు బీజేపీ నాయకులే చెబుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జయనగర్ బీజేపీ టికెట్ ఆశించి చివరి నిమిషంలో హైకమాండ్ సూచన మేరకు తప్పుకున్న బీజేపీ నాయకుడు వివేక్‌రెడ్డి పేరు ప్రస్తుతం వినిపిస్తోంది. మాజీ సీఎం, సిట్టింగ్ ఎంపీ డీవీ సదానందగౌడ పోటీ చేయని పక్షంలో ఆ స్థానాన్ని జేడీఎస్‌కు వదులుకోవచ్చన్న చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగళూరులో జేడీఎస్ ప్రభావం అంతగా లేదు. మాజీ ముఖ్యమంత్రి హెచ్. డీ. కుమారస్వామి ఓ సర్వే చేయించారు.

జేడీఎస్, ఒక్కలిగుల ప్రభావం ఉన్న బెంగళూరు నార్త్ తనకు సేఫ్ నియోజకవర్గం అనే అభిప్రాయానికి మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి వచ్చారని తెలిసింది అందుకే, బీజేపీ వదులుకుంటే బెంగళూరు నార్త్ లో హెచ్. డీ. కుమారస్వామి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మండ్య జేడీఎస్‌కు అప్పగిస్తే అక్కడ పోటీ చెయ్యాలని మాజీ సీఎం కుమారస్వామి అనుకున్నారు. అయితే మండ్యలో జేడీఎస్ పార్టీకి టిక్కెట్ ఇస్తే అక్కడి సిట్టింగ్ ఎంపీ సుమలతను బెంగళూరు నార్త్‌లో పోటీకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం.
బెంగళూరు నార్త్‌ను జేడీ(ఎస్)కి అప్పగించే అవకాశం చాలా తక్కువని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో బెంగళూరు నార్త్‌లో బీజేపీకి చెందిన డీవీ సదానంద గౌడ 8, 24,500 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ బైరేగౌడకు 6,76,982 ఓట్లు వచ్చాయి. జేడీఎస్-కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అప్పటి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసింది.
2014 ఎన్నికల్లో బీజేపీకి చెందిన డీవీ సదానంద గౌడ 718,326 ఓట్లతో విజయం సాధించి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ కు చెందిన సీ నారాయణ స్వామి 4, 88,562 ఓట్లు సాధించి ఓడిపోయారు. జేడీఎస్‌కు చెందిన అబ్దుల్ అజీమ్‌కు కేవలం 92,681 ఓట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు బీజేపీ-జేడీఎస్ పొత్తులో భాగంలో లెక్కలు మారనున్నాయి.
-
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications