వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ ప్రయాణీకులకు 7 రోజుల క్వారంటైన్ - మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం : అమల్లోకి తాజా ఆంక్షలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న 'ఓమిక్రాన్' దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వైరస్ విస్తురిస్తున్నట్లుగా గుర్తించిన దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో భాగంగా హై రిస్కు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలంటూ ఆదేశాలిచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

ఏడు రోజుల క్వారంటైన్ అమలు

ఏడు రోజుల క్వారంటైన్ అమలు

ఇప్పటి వరకు ప్రభావిత.. రిస్కు పొంచి ఉన్న దేశాల జాబితాలో ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్, ఐరోపాలోని మొత్తం 44 దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్ తో పాటగా ఇజ్రాయెల్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఈ క్వారంటైన్ తప్పని సరి చేసారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల మేరకు హై రిస్కు గా పేర్కొన్న దేశాలతో పాటుగా ఇతర దేశాల నుండి ప్రయాణీకులు తప్పనిసరిగా విమానాశ్రయలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి.

ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి

ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి

పాజిటివ్ రిపోర్టు ఉంటే ఇంట్లో రెండు వారాల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండాలి. పాజిటివ్‌ అయితే వారిని ఆసుపత్రికి తరలిస్తారు. ఇక, మహారాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అంశాల్లో రిస్కు ఉన్న దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు తప్పని సరిగా ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. వారిని నిర్ణయించిన హోటళ్లలో ఉంచుతారు. అయితే, వాటి విధి విధానాలు.. ఎంత మేర చెల్లించాల్సిన అంశాల పైన ఇంకా అవగాహన లేకపోవటం కొంత అయోమయానికి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏడు రోజుల్లో మూడు సార్లు

ఏడు రోజుల్లో మూడు సార్లు


అంతర్జాతీయ ప్రయాణీకులు మూడు సార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చిన తరువాత రెండవ రోజు, నాల్గవ రోజు, ఏడవ రోజున ఈ పరీక్షలు చేయించుకోవాలని నిర్దేశించింది. అందులో పాజిటివ్ గా తేలిన ప్రయాణీకులను ఆస్పత్రికి తరలిస్తారు. నెగటివ్ గా గుర్తించిన వారిని ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని ప్రభుత్వ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఓమిక్రాన్ కనీస నిబంధనల్లో భాగంగా వీటిని అమలు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

కేంద్ర మార్గదర్శకాలకు కొనసాగింపుగా

కేంద్ర మార్గదర్శకాలకు కొనసాగింపుగా


అదే విధంగా.. రాష్ట్రానికి వెళ్లే అంతర్జాతీయ ప్రయాణీకులు గత 15 రోజులలో తాము సందర్శించిన దేశాల వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను సమర్పించాలి. దీనిని ఇమ్మిగ్రేషన్ ద్వారా క్రాస్-చెక్ చేయనున్నారు. తప్పుడు సమాచారం విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని సెక్షన్ల కింద చర్యకు ప్రయాణికులను బాధ్యులను చేస్తుందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

English summary
The Maharashtra government on said that all international passengers arriving from "at-risk" countries will have to undergo a mandatory seven-day institutional quarantine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X