నేను నేరస్తుడు కావడానికి సీఎం కారణం, ఎమ్మెల్యే సంచలనం, నా కొడుకు జోలికి వస్తే ?

శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై కాల్పులు జరిపి పోకిరిలా వ్యవహరించిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కారణమని ఆరోపించడం కలకలం రేపింది.

అరెస్టుకు ముందు ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నన్ను నేరస్థుడిని చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

The MLA who made sensational comments said that the CM made him a criminal

శివసేన నేత మహేష్ గైక్వాడ్ ను ఎందుకు రివాల్వర్ తో కాల్చాను అనే విషయంపై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ఛానల్ తో మాట్లాడిన కళ్యాణ్ ఈస్ట్‌ బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ నా కొడుకుపై పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగింది. ఇది నేను భరించలేకపోయానని, కోపంతో ప్రత్యర్థుల మీద కాల్పులు జరిపాను అని చెప్పాడు. అలాగే నా భూమిని కూడా బలవంతంగా శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్ లాక్కున్నాడని, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే కొనసాగితే నేరగాళ్లు పెరుగుతారని బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాలాంటి మంచి వ్యక్తిని నేరస్థుడిని చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ మహారాష్ట్ర సీఎంపై మండిపడ్డారు. నా కొడుకును పోలీస్ స్టేషన్‌లో కొట్టడం చూస్తే నేరాలు ఎంతగా పెరిగిపోయాయో అర్థం అవుతోందని, కోపం తట్టుకోలేక ప్రతీకారంగా మహేష్ గైక్వాడ్‌ను కాల్చానని, ఈ ఘటనపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని గణపత్ గైక్వాడ్ అన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఎవరైనా నా కొడుకును కొడితే ఏం చేయాలి చెప్పండి, కొడుకును కొడితే తండ్రి ఏం చేస్తాడో తానే కూడా అదే చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ అతని చర్యను సమర్ధించుకున్నాడు.

నేను శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్ ను చంపాలని అనుకోలేదు కానీ కోపంతో కాల్పులు జరిపానని బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు. ఫ్యాక్షన్ నాయకుడు మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ ఐదు రౌండ్లు కాల్పులు జరిపారని వెలుగు చూసింది. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో గణపత్ గైక్వాడ్ శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్ పై దాదాపు 10 సార్లు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. మహేశ్ గైక్వాడ్‌ను థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో చేర్చగా, వైద్యులు అతని శరీరం నుండి 6 బుల్లెట్లను తొలగించారు.

ప్రస్తుతం మహేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్, సందీప్ సరవంకర్, హర్షల్ కేన్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరింత మందిని అరెస్టు చేయడానికి 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్‌కు చెందిన భూమిని శివసేన నాయకుడు మహేశ్ గైక్వాడ్ బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఇద్దరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

ఆ సమయంలో ఇరువర్గాల మధ్య పోలీస్ స్టేషన్ లోనే తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి కాల్పులకు కూడా దారితీసింది. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కుమారుడిపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ రివాల్వర్ తో కాల్పులు జరిపారు. మహేశ్ గైక్వాడ్, రాహుల్ పాటిల్ పై కాల్పులు జరిపారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. వెంటనే పోలీసులు గణపత్ గైక్వాడ్ సహా ముగ్గురిని అక్కడికక్కడే అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+