ప్రేమించిందని... పదిహేనేళ్ల కూతురిని గొడ్డలితో చంపిన తల్లి...
ప్రేమించిందనే కారణంతో ఓ పదిహేనేళ్ల కూతురిని అత్యంత కిరాతంగా గొడ్డలితో కొట్టి చంపింది ఓ తల్లి.. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కోశాంబిలో వెలుగు చూసింది. ఆ తర్వాత కేసును ఛేదించిన పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు.
పొలంలోని బావిలో బాలిక మృతదేహం : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ తన 15 ఏళ్ల కుమార్తెను గొడ్డలితో చంపి, ఇతర కుటుంబ సభ్యుల సహాయంతో ఆ మృతదేహాన్ని బావిలో పడేసింది. అక్టోబర్ 2న పని నిమిత్తం పొలానికి వెళ్లిన కూతురు అప్పటి నుంచి కనిపించడం లేదు. ఎంతసేపటికి కూతురు ఇంటికి రాకపోవడంతో ఆ బాలిక తల్లి శివపతి అక్టోబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కిడ్నాప్ కేసు నమోదు చేసారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. అక్టోబరు 26న తేజ్వాపూర్ ఊరి బయట ఉన్న పొలంలోని బావిలో ఓ బాలిక మృతదేహాన్నిగుర్తించారు గ్రామస్థులు. గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ బాలిక మృతదేహం తన కూతురేదనని శివపతి గుర్తించింది. దీంతో ఈ మిస్సింగ్ కేసును భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్యకు శిక్ష)ను ఈ కేసులో చేర్చారని పోలీసులు తెలిపారు.

ప్రధాన నిందితురాలు తల్లే : అయితే, ఈ కేసులో కొన్ని ఆధారాలు శివపతిని ప్రధాన నిందితురాలిగా తేల్చాయి. దీంతో సోమవారం శివపతిని పోలీసులు అరెస్టు చేశారు. శివపతితో పాటు మరొక మైనర్ కుమార్తెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆమె కోడలు మీరా కూడా ఈ హత్యలో భాగస్వాములయ్యారని, అయితే ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. శివపతి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
హత్య చేసి బావిలో పడేసిన వైనం : శివపతి కూతురు అదే గ్రామానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న శివపతి ఆమె ప్రేమను అంగీకరించలేదు. ఆ అబ్బాయితో తిరగొద్దని కూతుర్ని శివపతి పలుమార్లు హెచ్చరించింది. అయితే, అందుకు కూతురు ఒప్పుకోలేదు. తల్లి వద్దన్నా అతనితో తిరుగుతోంది. దీంతో మాటవినని కూతురిని శివపతి అతి కిరాతంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్టోబర్ 2వ తేదీ అర్ధరాత్రి శివపతి, ఆమె మరో కూతురు, మీరా కలిసి గొడ్డలి, కర్రతో కొట్టి హత్య చేసినట్లు శివపతి పోలీసుల ముందు ఒప్పుకుంది. చంపేసిన తర్వాత ఆ మృతదేహాన్ని జనపనార సంచిలో నింపి తమ ఊరి బయట పొలంలో ఉన్న బావిలో పడేసినట్లు ఎస్పీ తెలిపారు. అయితే, ఈ విషయంపై ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం, నిందితులు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications