Borewell: బోరుబావిలో పడిన బాలుడిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్..

మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడిన బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.

మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో బోరుబావిలో పడిన 7 ఏళ్ల బాలుడిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. దాదాపు 26 గంటల శ్రమించి బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. ఆ వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లాలోని లాటరి తహసీల్ పరిధిలోని ఖేర్ఖేడీ పత్తర్ గ్రామంలో మార్చి 14న ఉదయం 11 గంటల ప్రాంతంలో లోకేష్ అహిర్వార్ అనే బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో జారి పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్ బాలుడు 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించింది. అనంతరం సురక్షితంగా బయటకు తీసేందుకు ఆపరేషన్ ప్రారంభించింది. జేసీబీ యంత్రాన్ని (ఎర్త్‌మూవర్) అమర్చడం ద్వారా బాలుడిని సురక్షితంగా రక్షించారని లాటరి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హర్షల్ చౌదరి తెలిపారు. లోకేష్ స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ఆ ప్రాంతానికి కోతులు వచ్చాయి. కోతులను చూసిన చిన్నారులు భయాందోళను గురై పరుగెత్తారు. ఈ క్రమంలో బాలుడు బోరుబాలి పడిపోయాడు.

The NDRF team rescued the boy who fell into the bore well in Madyapradhesh

అటు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం పొలంలో 200 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడు మంగళవారం మృతి చెందాడు. మరణించిన బాలుడిని సాగర్ బుధా బరేలాగా గుర్తించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అతని కుటుంబం మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా నుంచి అహ్మద్‌నగర్‌కు వలస వచ్చారు.

జిల్లాలోని కర్జాత్ తాలూకాలోని కోపర్డి గ్రామంలో స్థానిక రైతు కాకాసాహెబ్ సుద్రిక్‌కు చెందిన చెరకు పొలంలో సాయంత్రం 4 గంటల సమయంలో బాలుడు బోరుబావిలో పడిపోయాడని అహ్మద్‌నగర్ పోలీసు అధికారులు తెలిపారు. బాలుడు బోరుబావిలో దాదాపు 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి బాలుడి బయటకు తీయగా అతను చనిపోయినట్లు గుర్తుంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+