సీఎం రాజీనామా చేసే టైమ్ దగ్గర పడింది, అందరూ వెయిటింగ్, ప్రతిపక్షం

మైసూరు డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా స్కామ్) ఇంటి స్థలాల కుంభకోణానికి సంబంధించి రానున్న రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసే పరిస్థితి వస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే బీవై విజయేంద్ర జోస్యం చెప్పారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన బీవై, విజయేంద్ర సీఎం సిద్దరామయ్యను చూస్తుంటే జాలి వేస్తోందని అన్నారు.

ముడా కుంభకోణంలో అప్పటి మైసూరు కమిషనర్‌గా ఉన్న దినేష్‌కుమార్‌ను ఇప్పుడు సస్పెండ్ చేశారని,

ముడా కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించడం ఇదే తొలిసారి అని. ముడా కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్య కూడా రాజీనామా చేయాల్సిందే అని, ఆ రోజు కోసం వేచి చూడాల్సిందే అని కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై. విజయేంద్ర అన్నారు.

The opposition leader alleged that the days are getting closer for the CM to resign

వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం జరిగినప్పుడు ముఖ్యమంత్రి సిద్దరామయ్య అక్రమాలకు తావులేదని గొప్పలు చెప్పకున్నారని, అప్పుడు ఆయన స్వయంగా వాల్మీకి కార్పొరేషన్‌లో రూ. 87 కోట్లు. అక్రమం జరిగినట్లు అంగీకరించారని, ఇప్పుడు ముడా కుంభకోణం లేదని, బీజేపీ రాజకీయాలు చేస్తోందని అదే సిద్దరామయ్య ఆరోపిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే బీవై విజయేంద్ర అన్నారు.

అయితే ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని, గతంలో ఉన్న ముడా కమిషనర్‌ను సస్పెండ్ చేశారని తెలిపారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత చలవాది నారాయణస్వామిపై ఫిర్యాదు చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు కర్ణాటక గవర్నర్ వద్దకు వెళ్లారని, ఆ సమయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు ఎవ్వరూ రాజ్ భవన్ కు వెళ్లేదని బీవై విజయేంద్ర గుర్తు చేశారు.

సీఎం, డీసీఎం, మంత్రులు ఎవ్వరూ రాజ్ భవన్ కు ఎందుకు రాలేదు, రాజ్‌భవన్‌లో కాంగ్రెస్‌ నేతల తరఫున ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు ఎవరూ కనిపించలేదు. దీనిపై మంత్రి ప్రియాంక్ ఖర్గే సమాధానం చెప్పాలని బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు. ముడా స్కామ్ లో సీఎం సిద్దరామయ్య ఆయన పదవికి రాజీనామా చేసే రోజులు దగ్గర పడుతున్నాయని, ఆ రోజుఎప్పుడు వస్తుందా అంటూ కర్ణాటక ప్రజలు అందరూ చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారని బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+