కాలేజ్ గర్ల్స్ అపార్ట్ మెంట్ బాత్ రూమ్, బెడ్ రూమ్ లో స్పై కెమెరాలు, ఓనర్ ఎంజాయ్ !

ఉదయ్ పూర్/రాజస్థాన్: కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకులు అద్దె ఇండ్లు, అపార్ట్ మెంట్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. కాలేజ్ అమ్మాయిలకు అపార్ట్ మెంట్ అద్దెకు ఇచ్చిన యజమాని ఆ అపార్ట్ మెంట్ బాత్ రూమ్ లు, బెడ్ రూమ్ ల్లో స్పై కెమెరాలు సీక్రేట్ గా ఫిట్ చేసి కాలేజ్ అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడటం కలకలం రేపింది.

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నగరంలోని ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో మోహన్ లాల్ సుఖదియా యూనివర్శిటీ ఉంది. ఈ యూనివర్శిటీలో వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రతాప్ నగర్ లోని చాలా మంది ఇండ్ల యజమానులు, అపార్ట్ మెంట్ యజమానులు కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలకు ఇండ్లు అద్దెకు ఇచ్చారు.

 cccam

ఇదే ప్రాంతంలో రాజ్ సుందర్ నాథ్ ద్వార్ ఏరియాలో రాజేంద్ర సోని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాజేంద్ర సోని అతనికి చెందిన అపార్ట్ మెంట్లు కాలేజ్ అమ్మాయిలకు మాత్రమే అద్దెకు ఇచ్చాడు. బాత్ రూమ్ లో వాటర్ ప్రాబ్లమ్ ఉందని కాలేజ్ అమ్మాయిలు ఇటీవల అపార్ట్ మెంట్ యజమాని రాజేంద్ర సోనికి చెప్పారు.

కాలేజ్ కు వెలుతున్న అమ్మాయిలు అపార్ట్ మెంట్ తాళాలు యజమాని రాజేంద్ర సోనికి అప్పగించి రిపేర్ చేయించాని చెప్పారు. ఆ సమయంలో రాజేంద్ర సోని బాత్ రూమ్ లో రిపేర్ చేయించాడు. తరువాత కాలేజ్ అమ్మాయిలు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని బాత్ రూమ్ లో, బెడ్ రూమ్ లోని ఎలక్ట్రికల్ వస్తువుల్లో సీక్రేట్ గా స్పై కెమెరాలు ఫిట్ చేశాడు.

సాయంత్రం కాలేజ్ నుంచి అపార్ట్ మెంట్ కు వచ్చిన కాలేజ్ అమ్మాయిలకు తాళం ఇచ్చిన రాజేంద్ర సోని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత బాత్ రూమ్ లో, బెడ్ రూమ్ లో కాలేజ్ అమ్మాయిలు ఏం చేస్తున్నారు ? అంటూ రాజేంద్ర సోని అతను నివాసం ఉంటున్న ఇంటి నుంచి లైవ్ లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు.

cam

అయితే అదే అపార్ట్ మెంట్ లో విద్యుత్ షార్ట్ సర్క్కూట్ కారణంగా విద్యుత్ వైర్లు అన్నీ కాలిపోయాయి. ఎలక్ట్రికల్ పనులు చెయ్యడానికి టెక్నీషియన్లు వెళ్లిన సమయంలో కాలేజ్ అమ్మాయిలు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని బాత్ రూమ్ లు, బెడ్ రూమ్ ల్లో స్పై కెమెరాలు బయటపడటం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయిలు అపార్ట్ మెంట్ యజమాని రాజేంద్ర సోనిని నిలదీశారు. మీకోసం ఎవడు వచ్చాడో ?, ఏ బాయ్ ఫ్రెండ్ స్పై కెమెరాలు పెట్టాడో నాకు ఏమి తెలుసు అంటూ ఎదురుతిరిగాడు. కాలేజ్ అమ్మాయిలు ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పోలీసుల విచారణలో అపార్ట్ మెంట్ యజమాని రాజేంద్ర సోని కాలేజ్ అమ్మాయిలు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో స్పై కెమెరాలు ఫిట్ చేశాడని వెలుగు చూసింది.

కాలేజ్ అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుకున్న అపార్ట్ మెంట్ ఓనర్ రాజేంద్ర సోనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అంతకు ముందు అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే కాలేజ్ అమ్మాయిలకు ఈ మ్యాటర్ తెలుసి మేము ఏకాంతంగా ఉండే సమయంలో ఓనర్ రాజేంద్ర సోని స్పై కెమెరాల్లో ఏమైనా వీడియోలు రికార్డు చేశాడారా అంటూ హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+