వేడివేడి పాలతో పసిబిడ్డకు స్నానం చేయించి పూజలు చేసిన పూజారి, వింత ఆచారం!
లక్నో/ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో మతపరమైన ఆచారంలో భాగంగా ఒక పూజారి పసిబిడ్డకు మరుగుతున్న పాలతో స్నానం చేయించారు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లాలోని శ్రావణ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పవిత్ర నగరమైన వారణాసిలోని పూజారి మతపరమైన ఆచారంలో భాగంగా చిన్నారికి మరుగుతున్న పాలతో స్నానం చేయించారు.
ఆ వీడియోలో కనిపిస్తున్న పూజారి పేరు వారణాసికి చెందిన పండిట్ అనిల్ భగత్‌గా గుర్తించారు. వైరల్ వీడియోలో పూజారి అనిల్ భగత్ పిల్లవాడిని తన మోకాలిపై పడుకోబెట్టుకుని మరుగుతున్న పాల కుండ నుండి నురుగును పట్టుకుని పిల్లల ముఖంపై రుద్దాడు. వేడి పాలు శరీరం మీద పడటంతో ఆ బిడ్డ నొప్పి, మంటలు తట్టుకోలేక నిరంతరం ఏడుస్తూ కనిపించింది.

పిల్లవాడు నొప్పితో కేకలు వేస్తున్నప్పటికీ పూజారి పండిట్ భగత్ అతని ఆచారాన్ని కొనసాగించాడు. ఈ మతపరమైన వేడుకలో వేలాది మంది ప్రజలు గుమిగూడడం కనిపిస్తుంది. దానికితోడు ఆ చిన్నారి తన ముందు అరుస్తూ ఏడుస్తున్నప్పటికీ పూజారి పండిట్ భగత్ మాత్రం ఆ బాలుడిని వదలకుండా ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. నివేదికల ప్రకారం, శ్రవణ్‌పూర్ గ్రామంలో కాశీదాస్ బాబా పూజలో భాగంగా ఈ వింత ఆచారం జరిగినట్లు తెలిసింది.
యాదవ సమాజంలో ఇది సర్వసాధారణమని ఇండియా టుడే కథనం ప్రచురించింది. ఇటీవలి కాలంలో, పిల్లలు బాధాకరమైన మరియు కొన్నిసార్లు ప్రాణాంతకమైన మూఢనమ్మకాలలో ఎక్కువగా బలి అవతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలో మూడు నెలల పసికందును ఒక వైద్యుడు వేడి ఇనుప రాడ్‌తో 20 సార్లు కాల్చాడు. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది. ఇలాంటి సంఘటనలు కొన్ని వెలుగు చూస్తుంటే చాలా సంఘటనలు బయటకు రావడం లేదు.












Click it and Unblock the Notifications