Man Ki Baat: మ‌న్ కీ బాత్‌లో ఏడేళ్ల చిన్నారి గురించి ప్ర‌స్తావించిన ప్ర‌ధాని..

ప‌ద‌కోండేళ్ల వ‌య‌సున్న పిల్ల‌లు సాధార‌ణంగా ఏం చేస్తుంటారు. స్కూల్‌కి వెళ్ల‌డం, చ‌ద‌వ‌డం, ఆడుకోవ‌డమే వారి దిన‌చ‌ర్య‌. అంతకుమించి పెద్ద‌పెద్ద ఆలోచ‌న‌లంటూ వారికేమీ ఉండ‌వు కూడా. సాధార‌ణంగా ఈ వ‌య‌సులో ఉన్న పిల్ల‌లు వీడియో గేమ్స్ ఆడ‌ట‌మో, పుస్త‌కాలు చ‌ద‌వ‌డ‌మో చేస్తుంటారు. కానీ, ఓ ప‌ద‌కొండేళ్ల అమ్మాయి మాత్రం పుస్త‌కాలు చ‌ద‌వ‌టమే కాకుండా, ఎంతోమంది ఆ పుస్త‌కాల‌ను చ‌దివేలా కృషి చేసింది చేస్తోంది కూడా. అంతేకాదండోయ్ సొంతంగా ఆ అమ్మాయే ఏడు లైబ్రరీలు త‌యారుచేసింద‌ట‌! ఆ అమ్మాయి చేసిన ప‌నికి దేశ ప్ర‌ధాని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అది కూడా ప్ర‌ధాని మోదీ మ‌న్‌కీబాత్ కార్య‌క్ర‌మంలో ఆ అమ్మాయి గురించి ప్ర‌స్తావించారు. పెద్ద‌వారి చేత మెప్పులు పొందుతున్న ఆ అమ్మాయి ఎవ‌రో తెలుసుకోవాల‌నుందా? ర‌ండి ఆ అమ్మాయి గురించి తెలుసుకుందాం.

అబ్దుల్ క‌లామే స్వ‌యంగా పేరు పెట్టారు..:ఆ అమ్మాయి ఎవ‌రో కాదు. తెలంగాణకు చెందిన విద్యార్థిని ఆక‌ర్ష‌ణ స‌తీష్‌. ఈమె స్వ‌స్థ‌లం హైద‌రాబాద్‌. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. హైద‌రాబాద్ స‌న‌త్‌న‌గ‌ర్‌కు చెందిన డాక్ట‌ర్ స‌తీస్ కుమార్తె ఈ అమ్మాయి. చిన్ననాటి నుంచే సాయం చేయాలన్న సంకల్పం ఈ అమ్మాయిలో దాగి ఉంది. హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో కూడా ఈ అమ్మాయి త‌న పాకెటీమ‌నినీ సిఎం ఫండ్‌కు ఇచ్చేసింది. ఈ అమ్మాయి తండ్రి డాక్ట‌ర్‌ అబ్దుల్ కలాం స్థాపించిన లీడ్ ఇండియా ఫౌండేషన్‌ కర్ణాటక, తమిళనాడు ఇంఛార్జ్‌గా పనిచేస్తున్నారు. ఆ అమ్మాయి తండ్రి కోరిక‌మేర‌కు అబ్దుల్ కలామే స్వయంగా ఈ చిన్నారికి ఆకర్షణ అని పేరు పెట్టార‌ట‌!

The Prime Minister mentioned about the seven-year-old girl in Mann Ki Baat.

ఇలా మొద‌ల‌య్యింది..:2021 అంద‌రికీ గుర్తే ఉంటుంది. క‌రోనా టైమ్‌. ఆ స‌మ‌యంలో ఓ రోజు ఆ అమ్మాయి తండ్రితో క‌లిసి ఎంఎన్‌జే పిల్లల క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లింది. సాధార‌ణంగా ఏ పిల్ల‌ల‌యినా కాస్త సెల‌వు దొరికితే చాలు ఎక్క‌డికైనా తిర‌గడానికి ఆలోచిస్తారు. కానీ, ఈ అమ్మాయి అలా ఆలోచించ‌లేదు. అక్కడున్న చిన్నారులతో ఆకర్షణ కాసేపు ముచ్చ‌టించింది. ఆ చిన్నారులు ఆమెను డ్రాయింగ్ బుక్స్, కథల పుస్తకాలు తీసుకురమ్మని చెప్పారు. కొన్ని పుస్తకాలు కొనింది. మరికొన్నింటిని తన అపార్ట్మెంట్ వాసులు, స్నేహితుల నుంచి 1036 పుస్తకాలు సేక‌రించింది. అదే ఆస్పత్రిలో ఏకంగా ఆ పుస్త‌కాల‌న్నింటితో క‌లిపి ఒక‌ లైబ్రరీనే ఏర్పాటు చేసింది ఆ అమ్మాయి. అలా ఆమె త‌న మొద‌టి లైబ్రరీని స్థాపించింది.

The Prime Minister mentioned about the seven-year-old girl in Mann Ki Baat.

ఏడు లైబ్రరీల ఏర్పాటు..:దాని త‌ర్వాత సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో 825 పుస్తకాలతో ఓ లైబ్ర‌రీని ఏర్పాటుచేసింది. బోరబండలోని గాయత్రి నగర్ అసోసియేషన్‌లో 250 పుస్తకాలతో మ‌రో లైబ్ర‌రీ. హైదరాబాద్ బాలికల జువైనల్ హోంలో625 పుస్తకాలతో ఓ లైబ్ర‌రీని ఏర్పాటు చేసింది. కోయంబత్తూరు సిటీ పోలీస్ స్టేషన్‌ వీధిలో 200 పుస్తకారతో మ‌రో లైబ్ర‌రీ, నోలంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నై బాయ్స్ క్లబ్‌లో 1200 పుస్తకాలతో ఆరో లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఇక‌, ఏడో లైబ్ర‌రీని ఓల్ట్ సనత్ నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 610 పుస్తకాలతో ఏర్పాటు చేసింది. ఈ విధంగా త‌ను అనుకున్న‌ది సాధించి, ఇప్ప‌టికీ ఏడు లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 2023వరకు పది లైబ్రరీలు పెట్టాల‌నుకున్న త‌న లక్ష్యాన్ని చేరుకోవాల‌ని మ‌న‌మంతా కోరుకుందాం.

ఈ అమ్మాయి చేసున్న మంచి ప‌ని గురించి తెలుసుకున్న ప్ర‌ధాని ఆమె గురించి దేశ‌మంతా తెలుసుకునేలా దేశమంతా ఆసక్తికంగా వినే మన్‌ కీ బాత్‌లో ఆ అమ్మాయి గురించి ప్ర‌స్తావించారు. నిజంగా, ఈ అమ్మాయి చేస్తున్న ప‌నికి స‌లాం కొట్టాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+