Haryana: తారుమారైన కేకే సర్వే.. ఎందుకంటే..!

జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ ఫలితాలు వచ్చాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దాదాపు 90 శాతం ఎగ్జిట్ పోల్స్ హస్తం పార్టీదే విజయమని పేర్కొన్నాయి. కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. హర్యానాలో బీజేపీ మరోసారి విజయం సాధించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. అయితే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కేకే ఎగ్జిట్ పోల్ సర్వే తారుమారు అయింది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కేకే సర్వే సంస్థ ప్రీ-పోల్ సర్వే చేసింది. ఆ రాష్ట్రంలో ఓడిపోతుందని అంచనా వేసింది. బీజేపీ పోటీ చేసిన ప్రతి మూడు సీట్లలో 2 చోట్ల ఓటమి ఖాయమని పేర్కొంది. ధృవ్ రిసెర్చ్ ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ కు 57, బీజేపీ 27 వస్తాయని అంచనా వేసింది. ఇక సీ ఓటర్ కాంగ్రెస్ 50 నుంచి 58 సీట్లు, బీజేపీకి 20 నుంచి 28 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మాట్రిజ్ కాంగ్రెస్ కు 55 నుంచి 62, బీజేపీకి 18 నుంచి 24 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్ 55, బీజేపీకి26 సీట్లు వస్తాయని పేర్కొంది.

The results of the Haryana elections were different from the exit polls

దైనిక్ భాస్కర్ కాంగ్రెస్ 44 నుంచి 54 సీట్లు వస్తాయని.. బీజేపీకి 15 నుంచి 29 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. న్యూస్ 24 చానిక్య కాంగ్రెస్ కు 55 నుంచి 62, బీజేపీకి 18 నుంచి 24 సీట్లు వస్తాయని పేర్కొంది. టైమ్స్ నౌ కాంగ్రెస్ 50 నుంచి 64 స్థానాలు, బీజేపీకి 22-32 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ ఫలితాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా వచ్చాయి. హర్యానాలో బీజేపీ ప్రస్తుతం 39 స్థానాల్లో విజయం సాధించింది. 10 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 31 చోట్ల గెలిచింది. 5 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించంగా.. ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా పలు ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అయ్యాయి. అలాగే తెలంగాణ ఎన్నికలప్పుడు కచ్చితమైన సర్వే చేసిన ఆరా సంస్థ ఏపీ ఎన్నికలకు వచ్చేసరికి తారుమారు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+