కుప్ప కూలిన భ్యాంకు భవనం ...శిధిలాల క్రింద 20 మంది...
సోలాపూర్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భవనం పై కప్పు కుప్ప కూలింది. దీంతో ఒకరు మృతి చెందగా మరో ఇరవై మంది వరకు భవనం శిధిలాల క్రింద చిక్కుకున్నారు. ప్రమాద స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది కుప్ప కూలిన భవన శిధిలాలను తొలగిస్తున్నారు.

సోలాపూర్ హైవే సమీపంలోని కర్మలా గ్రామంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భవనం ఒక్కసారిగా కుప్ప కూలింది. దీంతో బ్యాంకులో ఉన్న 20మంది ఖాతాదారులు శిధిలాల క్రింద చిక్కుకున్నారు. దీంతో భాదితులను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా భవన శిధిలాల క్రింద చిక్కుకున్న మరో పదమందిని కూడ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి కూడ విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications