Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ రైల్వేస్టేషన్ లో స్వాతంత్ర సమరయోధుల ఆత్మలు..నైని రైల్వేస్టేషన్ హారర్ స్టోరీ!

భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో అనేక రైల్వే స్టేషన్లకు భయానకమైన చరిత్ర ఉంది. ఇప్పటికే దేశంలో ఘోస్ట్ రైల్వే స్టేషన్ గా పేరున్న బెగున్ కొడార్ రైల్వే స్టేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు రైల్వే స్టేషన్ లకు సంబంధించి దెయ్యాల కథలు, స్థానికంగా జరిగిన ప్రచారం తదితర వివరాలను తెలుసుకున్నాం.

ఉత్తర ప్రదేశ్ నైని రైల్వే స్టేషన్
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ వద్ద ఉన్న నైనీ రైల్వే స్టేషన్ గురించి, ఆ రైల్వే స్టేషన్ యొక్క హారిబుల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ప్రయాగ్ రాజ్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో నైని జంక్షన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ నైనీ జైలు సమీపంలో ఉంటుంది. దీనిని బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో నిర్మించారు.

The souls of freedom fighters in that railway station Naini Railway Station Horror Story

స్వాతంత్ర్య సమరయోధుల ఆత్మలు తిరుగుతాయని ప్రచారం
అయితే ఈ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న నైని జైలు ముఖ్యంగా నాటి స్వాతంత్ర సమరయోధులను ఖైదీ చేసే హింసించి వారి ప్రాణాలను తీసినటువంటి జైలు. ఈ రైల్వే స్టేషన్ ముఖ్యంగా నైనీ జైలుకు సమీపంలో ఉండడం వల్ల ఆ జైలులో చనిపోయిన స్వాతంత్ర సమరయోధుల ఆత్మలు ఈ రైల్వే స్టేషన్ లోనే తిరుగుతున్నాయని స్థానికులు చెబుతారు.

రాత్రయితే ఏడుపులు, అరుపుల శబ్దాలు
అప్పట్లో స్వాతంత్ర సమరయోధులను బ్రిటీష్ వాళ్ళు తీవ్రంగా హింసించడం వల్ల చనిపోయిన వారి ఆత్మలు ఆ రైల్వే స్టేషన్ వద్ద తిరుగుతున్నాయని ఇక్కడి వారు బలంగా నమ్ముతారు. జైల్లో బ్రిటిషర్ల హింసతో మరణించిన వారు, ఉరి తీయబడిన వారు అందరూ ఆత్మలుగా మారి ఇక్కడ తిరుగుతున్నారని రాత్రిపూట వారి ఏడుపులు, అరుపుల శబ్దాలు వినిపిస్తాయని పలువురు చెబుతారు.

పౌర్ణమి అయితే కనిపించే దెయ్యాలు
ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రులు ఈ దెయ్యాలు కనిపిస్తాయని కూడా చెబుతారు. రైల్వే ట్రాక్ల మీద, రైల్వే స్టేషన్ వద్ద అనేకమార్లు ఈ దెయ్యాల రూపాలను చూశామని పలువురు చెబుతున్నారు. ఈ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న జైలు చరిత్ర, అక్కడ చోటు చేసుకున్న వారి మరణాలు రైల్వే స్టేషన్ పైన దెయ్యాల కథలు ప్రచారం కావడానికి కారణమని తెలుస్తుంది.

రాత్రయితే ఆ స్టేషన్ నిర్మానుష్యం
ఏది ఏమైనా నేటికీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైని రైల్వే స్టేషన్ లో రాత్రి వేళల్లో ఎవరూ అక్కడ ఉండడానికి ఇష్టపడరు. రాత్రి అయితే చాలు నేటికి నిర్మానుష్యం గానే ఆ రైల్వే స్టేషన్ దర్శనమిస్తుంది. నేటికీ చాలామంది స్థానికులకు రాత్రి వేళ రైల్వే స్టేషన్ కు వెళ్ళాలంటే చెప్పలేనంత భయం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+