వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్రమోడీ ఎన్నికల ప్రసంగాలు: ఈ-బుక్‌గా "ద స్టోరీ ఆఫ్ మిషన్ 272+"

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2014 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోడీని ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఎన్నుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ అందుకున్న నినాదం "మిషన్ 272+". ఈ నినాదాన్ని భారతీయ ఓటర్ల మనసులోకి తాను పాల్గొన్న ప్రచార సభలు, ఎన్నికల ర్యాలీల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.

భారతదేశం రాజకీయాల్లో పార్టీలకు ఓటు బ్యాంకుగా ఉన్న ప్రజలను మోడీ తన వైపు ఎలా తిప్పుకున్నారు.. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మోడీ పాల్గొన్న ఎన్నికల ర్యాలీల్లో ఆయన ప్రసంగించిన తీరు.. ప్రజలను ఏ విధంగా ఆకట్టుకుంది లాంటి విషయాలను "ద స్టోరీ ఆఫ్ మిషన్ 272+" ఈ-బుక్ రూపంలో తీసుకొచ్చారు.

ప్రధాని నరేంద్రమోడీ అభిమానులు ఎవరైనా ఈ ఈ-బుక్ చదవాలనుకుంటే ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ-బుక్ ఉచితం. ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

The Story of Mission 272+ Campaign E-Book Published

Epub
Scribd
Google store

ఈ పుస్తకంలో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించిన 150 ప్రసంగాలను పొందుపరిచారు. మొదటి సెక్షన్‌లో భారత్‌పై ప్రధాని నరేంద్రమోడికి ఉన్న విజన్ గురించి ప్రస్తావించారు.

ముఖ్యంగా భారత్‌లో ఆర్థిక, ఆరోగ్య, సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి చేయాల్సిన చేయాల్సిన ప్రణాళికలను ఏవిధంగా వివరించారో ఉంది. ప్రధాన మంత్రి అభ్యర్ధిగా నరేంద్ర మోడీ పేరుని భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాత మోడీపై భారతీయ ప్రజల పట్లకి ఉన్న నమ్మకాన్ని తాను ఏవిధంగా నిలబెట్టుకున్నాడనే వివిధ అంశాలపై ఈ పుస్తకంలో చర్చించారు.

ఎన్నికల ప్రచార సభల్లో మోడీ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంతంలో స్ధానికంగా పట్టున్న రాజకీయ నేతలను పొగడ్తలతో ముంచెత్తడం లేదా వారి భాషలో మాట్లాడటం లాంటివి మోడీ ప్రసంగాల్లో ప్రముఖంగా ఉన్నాయి. మార్చి 25, 2014 నుంచి మే 2014 వరకు ప్రధాని నరేంద్రమోడీ 196 భారత్ విజయ్ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ ర్యాలీల్లో నరేంద్రమోడీ తన ప్రసంగాల్లో విసిరిన పంచ్‌లతో పాటు జాతీయ, స్ధానిక మీడియాతో ఇచ్చిన ఇంటర్యూలు ప్రచురించారు.

మేరీ స్వప్నోం కా భారత్, ఛాయే పే చర్చ, 3డీ హోలోగ్రాఫిక్ ర్యాలీలు గురించి కూడా ఈ పుస్తకంలో వివరించారు. చివరగా.. 2014 సాధారణ లోక్‌సభ ఎన్నికల్లో సాంకేతిక, సామాజిక మీడియాను సృజనాత్మకంగా ఎలా ఉపయోగించారో తెలుసుకోవచ్చు.

English summary
The Lok Sabha election for 2014 set new precedents when it came to the way Bharatiya Janata Party and its star campaigner and Prime Ministerial candidate Narendra Modi shaped the party’s campaigning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X