గుంటూరు కారం సినిమా కథ ఇదేనంట ?, ఇద్దరు సూపర్ స్టార్లు ఆ ఆ సినిమా తీసేశారా ?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ఈ వారం ప్రపంచ వ్యాప్తంగా ఇదే సంక్రాంతి పండుగకు విడుదల అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలు విడుదల కావడంతో రికార్డుల మోతమోగుతోంది. గుంటూరు కారం సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కావడంతో ఊహించని స్పందన వస్తోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా అభిమానులు ఎగబడి గుంటూరు కారం సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ కథనం కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబు మాస్ లుక్ చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. గతంలో మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలను సూపర్ హిట్‌గా నిలిచాయి.

వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాతో ఈ జోడి హ్యాట్రిక్ సాధిస్తుందని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు. గుంటూరు కారం సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వవం వహించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. అయితే ఎట్టకేలకు విడుదల అవుతున్న గుంటూరు కారం సినిమా కథపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.
గుంటూరు కారం సినిమా మలయాళ సినిమా రీమేక్ అని రూమర్స్ మొదలయ్యాయి. అదే మలయాళ చిత్రాన్ని కన్నడలో సాహససింహ డాక్టర్ విష్ణువర్ధన్ రీమేక్ చేశారు. ఐతే గుంటూరు కారం సినిమాకు, ఓ కన్నడ సినిమా కథకు లింక్ ఉందని ఇప్పుడు కర్ణాటకలో జోరుగా ప్రచాం జరుగుతోంది. ఇటీవల విడుదల అయిన గుంటూరు కారం ట్రైలర్ చూసిన చాలా మంది కన్నడిగులు ఈ సినిమా కథను ఊహించుకుంటున్నారు.
ఈ కథ మలయాళంలో మమ్ముట్టి నటించిన రాజమాణిక్యం కథను పోలి ఉందని, అందుకే ఈ సినిమాకి రీమేక్ గానో లేక ఇన్స్పిరేషన్ గానో గుంటూరు కారం సినిమా రూపొందిందన్న చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2005లో విష్ణువర్ధన్ మలయాళంలో హిట్ అయిన రాజమాణిక్యం సినిమాను 4 ఏళ్ల తర్వాత అంటే 2009లో బళ్లారి నాగ అనే పేరుతో రీమేక్ చేశారు. కన్నడలో దినేష్ బాబు బళ్లారి నాగ చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ బళ్లారి నాగ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆ సినిమా యూనిట్ నిరాశ చెందింది.

కన్నడలో బళ్లారి నాగ సినిమాను కె. మంజు నిర్మించారు. నాగమాణిక్య పాత్రలో విష్ణువర్దన్ మాత్రం చాలా అద్భుతంగా నటించారు. రాజమాణిక్యం సినిమా మాత్రమే కాదు, తెలుగులో ఉన్న ఓ నవల కథ కూడా అలాంటిదే. ఆ నవల స్ఫూర్తితో త్రివిక్రమ్ గుంటూరు కారం తీశారా? అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. అయితే గుంటూరు కారం సినిమా ఫస్ట్ షో పడితే తప్పా సినీ అభిమానుల ఊహలకు తెరపడే అవకాశం లేదని తెలిసింది. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని మైసూరు, మంగళూరు, శివమొగ్గ, బళ్లారి తదితర నగరాల్లో గుంటూరు కారం సినిమా టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ జోరందుకుంది.












Click it and Unblock the Notifications