వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"ఆపరేషన్ గంగా" - స్వదేశానికి చేరిన రెండో విమానం : 240 మందితో బయల్దేరిన మరో ఫ్లైట్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే కార్యక్రమం వేగవంతం అయింది. రష్యా ఉక్రెయిన్ పైన యుద్ద సన్నాహాలు ప్రారంభించిన సమయంలోనే ఉక్రెయిన్ లోని భారతీయులు తాత్కాలికంగా తిరిగి వచ్చేయాలంటూ భారత ప్రభుత్వం సూచించింది. అయితే, యుద్దం అరంభమైన తరువాత సైతం అనేక మంది అక్కడే చిక్కుకున్నారు. దాదాపుగా 16 వేల మంది భారతీయులు అక్కడ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అందులో వైద్య విద్యా కోసం వెళ్లిన విద్యార్ధుల సంఖ్య భారీగా ఉంది.

ఉక్రెయిన్ లో నిలిచిన 16 వేల మంది భారతీయులు

ఉక్రెయిన్ తమ గగనతలంలో నిషేధం విధించటంతో భారతీయ విద్యార్ధులు .. సరిహద్దులకు చేర్చి పొరుగు దేశాల నుంచి ఏయిర్ ఇండియా విమానాల్లో స్వదేశానికి తరలిస్తున్నారు. అందులో భాగంగా..ఇప్పటి వరకు రెండు విమానాల్లో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. తొలి విమానం 219 మందితో రొమేనియా శనివారం రాత్రి ముంబాయి చేరుకుంది. కేంద్ర మంత్రి పీయుష్​ గోయల్ విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రేయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఉక్రేయిన్​లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని సూచించారు.

చేరుకున్న రెండు విమానాలు

చేరుకున్న రెండు విమానాలు

సురక్షితంగా భారత్​కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే 'ఆపరేషన్​ గంగా'లో భాగంగా 250 మందితో బయలుదేరిన రెండో విమానం భారత్​కు చేరుకుంది. దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ తెల్ల వారు జామున చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని సూచించారు.

హంగేరీ నుంచి బయల్దేరిన మూడో విమానం

హంగేరీ నుంచి బయల్దేరిన మూడో విమానం

సురక్షితంగా భారత్​కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇక, ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలిస్తున్నారు. రెండు విమానాలు చేరుకోవటంతో... మరో 240 మందితో వరుసగా మూడో విమానం సైతం బయల్దేరింది. మరో విమానం బుడాపేస్ట్​ (హంగేరీ ) నుంచి బయలుదేరింది.

ఈ విమానం 240 మందితో బయలుదేరి దిల్లీకి చేరనుంది. ఉక్రెయిన్​ నుంచి వచ్చిన భారతీయులకు కేంద్ర మంత్రులు స్వాగతం పలికుతున్నారు. వెల్​కమ్​ బ్యాక్​ టు మదర్​ ల్యాండ్​ అంటూ వారిలో ధైర్యం నింపుతున్నారు. ఉక్రెయిన్​ నుంచి సురక్షితంగా బయటపడి ముబయి విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో ఆనందంగా ఉందని మంత్రులు చెబుతున్నారు.

Recommended Video

Russia Ukraine Conflict : భారత పౌరులకు, విద్యార్థులకు Indian Embassy కీలక సూచన!| Oneindia Telugu
ఆపరేషన్ గంగా పేరుతో తరలింపు

ఆపరేషన్ గంగా పేరుతో తరలింపు

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత కోసం అవిశ్రాంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. హంగేర..రుమేనియాసహకారంతో ఉక్రేయిన్​లో చిక్కుకున్న మిగతా వారిని కూడా స్వదేశానికి సురక్షితంగా చేర్చేలా కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో తెలుగు విద్యార్ధులు సైతం ఉన్నారు. వారి కోసం రెండు తెలుగు రాష్ట్రాలు తొలుత ఢిల్లీలోని ఏపీ భవన్ .. తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు చేసారు. అక్కడి నుంచి వారిని సొంత ఊర్లకు పంపనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు సైతం నిర్వహిస్తున్నారు.

English summary
The Second flight from Bucharest with 250 straders in Ukrained landed at Delhi air port.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X