నూతన పార్లమెంటు భవనంలోని మూడు ప్రధాన ద్వారాలకు ఆసక్తికర పేర్లు; ప్రత్యేకతలివే!!
మే 28వ తేదీన చారిత్రాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది చారిత్రాత్మక ఘట్టమని, అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని పేర్కొంది. నూతన పార్లమెంట్ భవనం 'మదర్ ఆఫ్ డెమోక్రసీ' ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నదని ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ భవనంలో మహాత్మాగాంధీ, చాణిక్యుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో సహా పలు ప్రముఖులైన నాయకుల విగ్రహాలు ఉంటాయని చెబుతున్నారు.కొత్త పార్లమెంటు భవనానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఈ ప్రవేశ ద్వారాలకు కూడా చారిత్రక అంశాలను మేళవిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పార్లమెంటు భవనానికి ఉన్న ప్రధాన ద్వారాలకు కూడా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.

నూతన పార్లమెంట్ భవనం లోని ప్రధాన ద్వారాలకు జ్ఞాన,శక్తి, కర్మలుగా నామకరణం చేశారు. జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి మరియు యాజ్ఞవల్క్య మధ్య జరిగిన సంవాద దృశ్యం, మరోవైపు నలంద చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. శక్తి ద్వారానికి ఒక వైపున చాణిక్య, మరోవైపున మహాత్మాగాంధీ దండియాత్ర దృశ్యాలను ఏర్పాటు చేస్తున్నారు. కర్మ ద్వారానికి ఒకవైపు కోణార్క్ చక్రం, మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం గత సెప్టెంబర్లో రాష్ట్రపతి భవన్ కు వెళ్లి చారిత్రాత్మక రహదారి రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా మార్చింది. ఈ క్రమంలో నూతన పార్లమెంట్ భవనానికి కూడా కొత్త పేరు పెట్టనున్నట్టు చర్చ జరుగుతుంది. ఈసారి నూతన పార్లమెంట్ భవనంలో స్పీకర్ కుర్చీ వద్ద ఏర్పాటు చేస్తున్న బంగారు రాజదండం సెంగోల్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఇక నూతన పార్లమెంట్ భవనం ఆవిష్కరణ సందర్భంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అంగరంగ వైభవంగా నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ వచ్చే ఆదివారం ప్రారంభించనున్నారు. అయితే పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి.
-
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications