Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వక్ఫ్ ఆస్తులకు మోదీ సర్కార్ సేఫ్ హ్యాండ్స్..!!

PM Modi: వక్ఫ్ ఆస్తులు అనేది- ఓ సంక్లిష్టమైన అంశం. తరచుగా న్యాయ పోరాటాలు సాగుతుంటాయి. వక్ఫ్ ఆస్తుల గుర్తింపు, పరిరక్షణ విషయంలో గందరగోళం తలెత్తుతుంటుంది. వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంటుంది. అలాంటి వివాదాస్పద అంశాలను తొలగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు పూనుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

ఇస్లామిక్ చట్టంలో బలంగా పాతుకుపోయిన వక్ఫ్ బోర్డులు దేశంలో మతం, సాంస్కృతికపరంగా తీవ్ర ప్రభావితం చేయడమే కాకుండా భూ యాజమాన్యం హక్కులు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌పై వివాదాలకు దారి తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

The Waqf Amendment Bill seeks to introduce enhance transparency and prevent the misuse

మోదీ 3.0లో దేశం సమగ్రాభివృద్ధి దిశగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వక్ఫ్ చట్టాన్ని సవరించడం అనివార్యమైంది. దీనికి బీజేపీ ప్రతిపాదించిన సవరణలు దేశంలో ఫ్లాష్ పాయింట్‌గా మారాయి. చర్చలకు తెర తీశాయి. వక్ఫ్ ఆస్తుల పరిధి, దాని అధికారాల దుర్వినియోగం గురించి ప్రశ్నలు తలెత్తుతూ వస్తోన్నాయి.

వక్ఫ్ అంటే ఏమిటి? అది ఎలా వివాదాస్పదమౌతోంది?, బీజేపీ చేపట్టిన సంస్కరణలు వక్ఫ్ ల్యాండ్‌ స్కేప్‌ను ఎందుకు పునర్నిర్మించగలవు అనే విషయాలను పరిశీలిద్దాం.

వక్ఫ్ అనేది ఇస్లామిక్ ఛారిటబుల్ ఎండోమెంట్‌కు ప్రతీక. దీనికి సంబంధించిన ఆస్తి మొత్తం కూడా మతపరమైన కార్యకలాపాలు, ధార్మిక ప్రయోజనాల కోసం విరాళంగా ఇచ్చినవే. ఆస్తిని వక్ఫ్‌‌కు విరాళంగా అందించిన తరువాత దాన్ని విక్రయించడం లేదా మరొకరి పేరు మీద బదిలీ చేయడం అసాధ్యం. ఆ ఆస్తి మొత్తం కూడా శాశ్వతంగా ఛారిటబుల్ ట్రస్ట్‌లో ఉండిపోతుంది.

ఇది- సిద్ధాంతపరంగా గొప్పదే అయినప్పటికీ.. ఆచరణలో విఫలమౌతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. విరాళంగా ఇచ్చిన ఆస్తుల దుర్వినియోగం జరుగుతోందని, చట్టవిరుద్ధమైన క్లెయిమ్‌లు సంభవిస్తోన్నాయనే ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తోన్నాయి.

వక్ఫ్ ఎదుర్కొంటోన్న ప్రాథమిక వివాదాల్లో ఒకటి- దాని పరిధిలో క్లెయిమ్ చేసిన ఆస్తుల మొత్తం. సరైన డాక్యుమెంటేషన్ లేదా ధృవీకరణ అనేది లేకుండానే దేశవ్యాప్తంగా ప్రైవేట్ భూములు మొదలుకుని రియల్ ఎస్టేట్ వరకు వేల ఎకరాలు- వక్ఫ్‌కు చెందినవిగా గుర్తించారనే వివాదాలు తరచు తలెత్తుతుంటాయి.

తమ వ్యక్తిగత ఆస్తులు సైతం తమకు తెలియకుండా లేదా తమ అనుమతి తీసుకోకుండా వక్ఫ్‌ బోర్డులకు చెందినవిగా నమోదు చేసినట్లు గుర్తించారు. ఇది అనేకసార్లు న్యాయ పోరాటాలకు దారితీసింది. కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి వివాదాలు న్యాయస్థానాల్లో ఉంటోన్నాయి. ఈ వక్ఫ్ చట్టాన్ని భఆక్రమణ కోసం దుర్వినియోగం చేస్తోన్నారనే ఆందోళనలు జరిగిన సందర్భాలు లేకపోలేదు.

వక్ఫ్ భూమిని వాణిజ్యపరంగా వినియోగించుకోవడం వివాదాస్పద అంశం. వక్ఫ్ ఆస్తులను ధార్మిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడినప్పటికీ- చాలా వరకు వాణిజ్య కార్యకలాపాల కోసం వాడుకుంటోన్నారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. వక్ఫ్ భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చిన ఉదంతాలు అనేకం. ఒకరు విరాళంగా ఇచ్చిన ఆస్తులను తమకు ఆదాయాన్ని సమకూర్చే వెంచర్‌గా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వక్ఫ్ భూమిని ఈ వాణిజ్యపరమైన వినియోగం కోసం వినియోగించుకోవడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమైన పరిస్థితులు లేకపోలేదు. ఈ సమస్యల పరిష్కారానికి మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలను ప్రతిపాదించింది. వక్ఫ్ సవరణ బిల్లు కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టడానికి, పారదర్శకతను పెంచడానికి, వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి దోహదపడుతుంది.

వక్ఫ్ భూముల నిర్వహణకు మరింత పటిష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ఈ సవరణల ముఖ్య ఉద్దేశం. ప్రతిపాదిత సంస్కరణల పట్ల ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బిల్లు తమ మతపరమైన హక్కులపై దాడిగా ఆయా సంస్థలు అభివర్ణిస్తోన్నాయి.

వ్యక్తిగత, వాణిజ్య ప్రయోజనాల కోసం వక్ఫ్‌ ఆస్తులను వినియోగించుకోవడాన్ని అరికట్టడానికి ఈ బిల్లును సవరించాల్సిన అవసరం ఉందంటూ మద్దతిచ్చే వాళ్లూ చాలామందే ఉన్నారు. ఈ సవరణలకు ఆమోదం లభించితే దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చు.

వక్ఫ్ క్లెయిమ్‌లను తప్పకుండా ధృవీకరించడం అనేది కేంద్రం చేపట్టిన కీలక సవరణల్లో ఒకటి. ఈ సవరణ వల్ల చట్టబద్ధమైన ఆస్తులు మాత్రమే వక్ఫ్ పరిధిలోకి వస్తాయి. ఈ బిల్లు వక్ఫ్ భూములను వాణిజ్య అవసరాల కోసం వినియోగించడాన్ని అడ్డుకుంటుంది. విరాళంగా ఇఛ్చిన ఆస్తులను సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం, వాటిని ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు లీజుకు ఇవ్వడాన్ని అరికడుతుంది. వక్ఫ్ బోర్డు కార్యకలపాల్లో పారదర్శకతను పెంచడానికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోంది.

వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడం వల్ల మతపరమైన సంఘాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్రం భరోసా ఇస్తోంది. పైగా వాటిల్లో జవాబుదారీతనం పెరుగుతుందని స్పష్టం చేస్తోంది.

దేశ విభజన సమయంలో వలస వెళ్లిన వారికి సంబంధించిన ప్రైమ్ ఎవాక్యూ ప్రాపర్టీలను వక్ఫ్‌గా మార్చడంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను చాలామంది విమర్శిస్తోన్నారు. ఈ చర్య మెజారిటీ ప్రజల హక్కులను విస్మరించిందని, రాజకీయ లబ్ధి కోసం మైనారిటీ వర్గాలను సంతృప్తి పరచడానికి ఒక మార్గంగా భావించిందనే ఆరోపణలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భూ విధానాలను తారుమారు చేసిన చరిత్ర చాలా మందికి చేదు అనుభవాన్ని మిగిల్చిందనడంలో సందేహాలు అక్కర్లేదు. అలాంటి వివాదాలు, విధానాలే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ తాజా సంస్కరణల డిమాండ్‌కు మరింత ఆజ్యం పోసింది.

వక్ఫ్‌లో మహిళలు, బోహ్రాలు, అగాఖానీలు లేకపోవడం మరొక వివాదాస్పద అంశం. ఈ ఆస్తుల నిర్వహణను పర్యవేక్షిస్తున్న వక్ఫ్ బోర్డులు గానీ నిర్ణయాత్మక పాలకమండలిలో గానీ మహిళలు, బోహ్రాలు, అగాఖానీలకు చోటు కల్పించడానికి నిబంధనలు అనుమతించవు. ఈ నిబంధనలు వక్ఫ్ బోర్డుల సమగ్రత, సమర్థత, జవాబుదారీతనం, పారదర్శకతలో అనేక ప్రశ్నలను రేకెత్తిస్తాయి. ముస్లిం సమాజంలోని కీలక వర్గాల నుంచి ప్రాతినిథ్యం లేకపోవడం కూడా ప్రస్తుత వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ వక్ఫ్ సంస్కరణల పట్ల దేశవ్యాప్తంగా హిందూ ధార్మిక సంస్థల నుంచి భారీగా సానుకూల స్పందన లభించింది. వక్ఫ్ సవరణ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ప్రభుత్వానికి లక్షలాదిమంది ఈమెయిల్స్ పంపించారు. వక్ఫ్ నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం పెరుగుతున్న డిమాండ్‌కు ఇవి అద్దం పట్టినట్టయింది.

ముఖ్యంగా వక్ఫ్ భూముల దుర్వినియోగాన్ని అరికట్టాలని, పౌరులందరి హక్కులను కాపాడాలని హిందూ ధార్మిక సంస్థలు బలంగా కోరుతోన్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వానికి 10,000 వరకు ఇమెయిల్‌లు వచ్చినట్లు తెలుస్తోంది.

దేశంలో వక్ఫ్‌ సవరణలపై మొలకెత్తిన ఈ చర్చ దేశంలోని విస్తృత రాజకీయ, మతపరమైన ప్రగతికి ప్రతిబింబంగా చెప్పుకోవచ్చు. మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లు వక్ఫ్ బోర్డుల అధికార దుర్వినియోగాన్ని అరికట్టడం, పారదర్శకతను పెంపొందించడం, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ఒక సాహసోపేతమైన చర్యగా అభినందిస్తోన్నారు.

బిల్లుపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ.. సంస్కరణలను తీసుకుని రావాల్సిన అవసరం ఉందనే వాదన ప్రజల్లో బలంగా ఉంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. దేశంలో నివసించే అన్ని వర్గాల వారికీ సమాన న్యాయాన్ని కల్పించడంలో బీజేపీ నిబద్ధతకు ఇది నిలువుటద్దం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+