Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఫ్ షేరింగ్, హీరోయిన్ లాంటి అందంగా ఉన్న భార్యను భర్త ఏం చేశాడంటే, కేరళ కుట్టితో ?

తిరువనంతపురం/కేరళ: భార్యలను మార్చుకుని ఎంజాయ్ చెయ్యడం భారతదేశంలో కూడా ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. స్నేహితులు వారి భార్యలను పరస్పరం మార్చుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. వైఫ్ షేరింగ్ తో ఇప్పటికే చాలా మంది వారికి కావలసిన పడక సుఖం అందుకుంటున్నారు. భార్య మార్పిడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

కేరళలోని కొట్టాయంకు చెందిన షినో మాథ్యూ అలియాస్ మాథ్యూకు బాలాకోట్‌కు చెందిన మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదట భార్యతో మాథ్యూ చాలా సంతోషంగా ఉన్నాడు. మాథ్యూకు చాలా మంది కోటీశ్వరులైన వ్యక్తులు స్నేహితులు అయ్యారు. మాథ్యూ విలాసాలకు అలవాటుపడ్డాడు.

The woman who filed the case that my husband was telling her to have sex with his friends was murdered in Kerala.

మాథ్యూ భార్య చూడటానికి సినిమా హీరోయిన్ లా ఉంటుందని సమాచారం. రెండేళ్ల క్రితం తన భర్త మాథ్యూ తనను అతని స్నేహితులతో పడుకోమని ఒత్తిడి చేస్తున్నాడని, వైఫ్ షేరింగ్ కు నువ్వు అంగీకరించాలని తన మీద చాలా ఒత్తిడి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడని అతని భార్య కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతకు ముందే ఆ మహిళ భర్త మాథ్యూకు కొందరు ధనవంతులైన మిత్రులతో పరిచయం ఏర్పడింది. వీరంతా సోషల్ మీడియాలో జోడీ షేరింగ్, కపుల్ మీట్ అప్ వంటి కొన్ని గ్రూప్‌లను క్రియేట్ చేసి, తమ భార్యలను పంచుకోవడం మరియు ఒకరితో ఒకరు సెక్స్ చేయడం వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని తెలుసుకుని తాను హడలిపోయానని ఆమె పోలీసులకు చెప్పింది.

The woman who filed the case that my husband was telling her to have sex with his friends was murdered in Kerala.

మాథ్యూ భార్య చూడటానికి సినిమా హీరోయిన్ లా ఉండటంతో ఆమె మీద మాథ్యూ ఫ్రెండ్స్ కన్నుపడింది. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు ఇస్తామని, నీ భార్యతో మాకు పడక సుఖం కావాలి మాథ్యూకు అతని ఫ్రెండ్స్ చెప్పారు. అప్పటికే ఒకరి భార్యలను ఒకరు మార్చుకుని ఎంజాయ్ చేస్తున్న యాప్ లో సభ్యుడిగా ఉన్న మాథ్యూ అతని భార్యను ఫ్రెండ్స్ కు షేర్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఒకరోజు ఆమహిళ దగ్గరకు వెళ్లిన భర్త తనకు తెలిసిన వారితో నువ్వు లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని ఆమె ఆరోపించింది. నువ్వు నా స్నేహితులకు పడక సుఖం ఇవ్వకుంటే పిల్లలను చంపేస్తానని తన భర్త మాథ్యూ బెదిరించాడని బాధితురాలు ఇంతకు ముందే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో దిగ్భ్రాంతికి గురైన మహిళ రెండేళ్ల క్రితం ఆమె భర్త మాథ్యూ మీద పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టింది. దీనిపై పోలీసులు మహిళ భర్తను అదుపులోకి తీసుకుని విచారించి అతడి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. వందలాది మంది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అలాగే భర్త మాథ్యూతో పాటు బృందంలో ఉన్న 6 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటన తరువాత బాధితురాలు ఆమె భర్త మాథ్య నుండి విడిపోయి ఆమె తండ్రి, సోదరుడితో కలిసి ఒంటరిగా నివాసం ఉంటుంది. ఈ కేసులో భర్త మాథ్యూపై ఫిర్యాదు చేసిన మహిళ ఆమె నివాసం ఉంటున్న ఇంటిలోనే దారుణ హత్యకు గురైంది.

ఆ రోజు మహిళ తండ్రి, సోదరుడు పనిమీద బయటకు వెళ్లగా ఆమెను కత్తులతో పొడిచి చంపేశారని పోలీసులు అంటున్నారు. సమాచారం విని షాక్‌కు గురైన మహిళ తండ్రి, సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ భర్త మాథ్యూ తన కూతురిని హత్య చేసి ఉంటాడని మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి మాథ్యూ కోసం వెతుకుతున్నా అతను చిక్కడం లేదని పోలీసులు అంటున్నారు. వైఫ్ షేరింగ్ యాప్ సభ్యులతో తన భర్త డీల్ పెట్టుకున్నాడని ఫిర్యాదు చేసి కోర్టు చుట్టూ తిరుగుతున్న మహిళ హత్యకు గురి కావడం కేరళలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+