Chandrayaan3: యావత్ ప్రపంచం చూపు భారత్ వైపు.. కోట్లాది కళ్లతో ఎదురు చూస్తున్న భారతావని..
యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం ప్రతి భారతీయుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిని ముద్దాడనుంది. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఒక్కో అడుగు ఆచితూచి వేస్తూ ముందుకు వెళ్తున్నారు. మన ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా దిగితే బాబిల్లిపైకి ల్యాండర్ పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తోంది.
చంద్రయాన్-3ని జులై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపారు. సుమారు 41 రోజుల ప్రయాణం అనంతరం చంద్రయాన్ జాబిల్లిపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్-2 విఫలమవడంతో అందులోంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో శాస్త్రవేత్తల మరింత జాగ్రత్తగా చంద్రయాన్-3 రూపొందించారు. ఈసారి ల్యాండర్ కు అదనపు సెన్సర్లు అమర్చింది. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడం కోసం అనేక చర్యలు తీసుకుంది. అయినప్పటికీ చంద్రుడిపై ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి.

రష్యా పంపిన లూనా-25 ల్యాండర్ చివరి క్షణంలో చంద్రుడిపై కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా ముందడుగేస్తున్నారు. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మరోవైరు ల్యాండర్ ఏదైనా అసాధారణ పరిస్థితులు గమినిస్తే ల్యాండింగ్ ను గురువారానికి వాయిదా వేయనున్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయితే.. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు రానుంది.
జులై14 చంద్రయాన్ ను నింగిలోకి పంపారు. ఆ తర్వాత భూ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 1న చంద్రుడి కక్ష్య వైపుగా తీసుకెళ్లారు. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 6, 9, 14, 16న ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్య తగ్గిస్తూ చంద్రుడికి దగ్గరగా తీసుకెళ్లారు. ఆగస్టు 17న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ ను విడదీశారు. ఆగస్టు 18న ల్యాండర్ డీ బూస్టింగ్ చేశారు. ఆగస్టు 20న ల్యాండర్ కు మరోసారి డీ బూస్టింగ్ చేశారు. ప్రస్తుతం ల్యాండర్ చంద్రుడికి దగ్గరలో ప్రయాణంచేస్తోంది.












Click it and Unblock the Notifications