ఆయనకు 39మంది భార్యలు.. 94మంది పిల్లలు.. ఇంకా!: వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ..

Subscribe to Oneindia Telugu

ఐజాల్: 39 మంది భార్యలు.. 94 మంది పిల్లలు.. 14 మంది కోడళ్లు, 40 మంది మనుమలు, మనుమరాళ్లు.. ఇదీ మిజోరం రాష్ట్రంలోని జియోనా అనే వ్యక్తి కుటుంబం. మిజోరమ్‌ రాష్ట్రంలోని బక్తావంగ్‌ గ్రామంలో నివసించే జియోనా.. తొలి నుంచి అత్యంత ధనవంతుడు కావడంతో యుక్త వయసులో ఉన్నప్పుడు పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకున్నాడు.

181మంది ఉండే ఆ కుటుంబం ఇప్పటికీ ఒకే భవనంలో నివాసముంటోంది. ప్రపంచంలో జియోనా కుటుంబమే అతిపెద్ద కుటుంబంగా రికార్డుల్లోను ఎక్కింది. బక్తావంగ్ గ్రామంలోని నాలుగంతస్తుల భవనంలో వీరు నివాసముంటున్నారు. ఇందులో వంద గదులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద కుటుంబమైనా వీరంతా అన్యోన్యంగా కలిసుండటం విశేషం.

The world's biggest family: The man with 39 wives, 94 children and 33 grandchildren
Diwali 2017 : ధర్మ సందేహాలు మరియు నియమములు Part 2 | Oneindia Telugu

వంటా వార్పు లాంటి పనులన్ని కలిసే చేసుకుంటారు. ఈ కుటుంబం ఒక రోజు తిండికి 50కిలోల బియ్యం, 70కిలోల మాంసం అవసరమవుతున్నాయట. ఇన్నాళ్లు కుటుంబ పోషణంగా జియోనా ఒక్కడే భరించగా.. ఇప్పుడు ఎదిగొచ్చిన పిల్లలు కూడా తలా కొంత సహాయం చేస్తున్నారట.

The world's biggest family: The man with 39 wives, 94 children and 33 grandchildren

జియోనా కుటుంబానికి చెందిన ఫోటోలు, కొన్ని వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చాలామంది ఈ కుటుంబం గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
He is head of the world's biggest family - and says he is 'blessed' to have his 39 wives.
Please Wait while comments are loading...