IPL 2024: ఐపీఎల్ 2024 విదేశాల్లో జరుగుతుందా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అత్యంత విజయవంతమైన టోర్నీల్లో ఒకటి. ఐపీఎల్ జరిగే రెండు నెలలు ఇండియాలో ఫుల్ ఏంజాయ్ ఉంటుంది. క్రికెట్ ప్రేక్షకులకు ఐపీఎల్ పెద్ద పండుగే. అయితే ఏపీఎల్ 2024 భారత్ లో జరగకపోవచ్చు. వచ్చే ఏడాది మే, జూన్ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఐపీఎల్ ఇండియాలో జరగడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఐపీఎల్ 2024 మొదటి అర్ధభాగం ఇండియాలో జరిపి.. రెండో అర్ధభాగం విదేశాల్లో నిర్వహించేందు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అవసరమైతే వచ్చే ఏడాది మార్చిలో ఐపీఎల్‌ను నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం మా పూర్తి దృష్టి ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023పైనే ఉంది. ఐపీఎల్‌కు ఇంకా చాలా సమయం ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి, ఇంతకు ముందు కూడా మేము ఎన్నికలు, టోర్నమెంట్‌లు రెండింటినీ చాలా బాగా నిర్వహించామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అవసరమైతే IPL 2024 విదేశాలలో కూడా చేయవచ్చని చెబుతున్నాయి.

"అయితే, టోర్నీని భారత్‌లో మాత్రమే నిర్వహించడమే మా మొదటి ప్రాధాన్యత. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడకూడదు" అని ఓ అధికారి చెప్పారు. గత ఐపీఎల్ అంటే 2023 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి 5వ సారి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై రెండూ సమానంగా 5-5 సార్లు టైటిల్ గెలిచిన జట్లుగా నిలిచాయి.
లోక్‌సభ ఎన్నికల కారణంగా ఇప్పటి వరకు ఐపిఎల్‌ను 2 సార్లు భారతదేశం ఐపీఎల్ జరిగింది. 2009 లోక్‌సభ ఎన్నికల కారణంగా IPLని దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. దీని తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను రెండు భాగాలుగా నిర్వహించారు. సగం టోర్నీ భారత్‌లో జరగగా, మిగతా మ్యాచ్‌లు యూఏఈలో జరిగాయి.మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024 ఐపీఎల్ 2024కు అడ్డుగా మారే అవకాశం ఉంది. మే-జూన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. పలు నివేదికల ప్రకారం జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications