స్టార్ హీరోతో క్లోజ్ గా ఉంటున్న రౌడీషీటర్ బ్యారెక్ లో డ్రగ్స్ స్వాధీనం, ఏం జరుగుతోంది ?

కన్నడ హీరో దర్శన్‌కు ప్రత్యేక సౌకర్యాల కల్పించారనే కేసు నమోదు అయిన నేపథ్యంలో బెంగళూరు ఆగ్నేయ విభాగం పోలీసులు పరప్ప అగ్రహార సెంట్రల్ జైలుపై ఆకస్మికంగా దాడి చేసి రౌడీ విల్సన్ గార్డెన్ నాగరాజ్ నుంచి మొబైల్, డ్రగ్స్, 25 వేల నగదు, పెన్ డ్రైవ్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారని కన్నడ మీడియా తెలిపింది. జైల్లో దర్శన్‌తో కలిసి టీ పార్టీలో కనిపించిన విల్సన్ గార్డెన్ నాగ కర్ణాటక మొత్తం హాట్ టాపిక్ అయ్యాడు.

హీరో దర్శన్ కు రాచమర్యాదలు కల్పించిన బెంగళూరు పరప్ప అగ్రహార సెంట్రల్ జైలు అసలు స్వరూపం బట్టబయలైంది. బెంగళూరు

There is a rumor that drugs have been found in the jail where Kannada hero Darshan s friend is staying
ఆగ్నేయ విభాగం డీసీపీ సారా ఫాతిమా ఆధ్వర్యంలో జైలులో ఆకస్మిక ఆపరేషన్ నిర్వహించగా 15 మొబైల్స్, 7 ఎలక్ట్రిక్ స్టవ్‌లు, మూడు లాంగ్‌లు, బీడీ-సిగరెట్ ప్యాకెట్లు, 20 గ్రాముల డ్రగ్స్ ఉన్నట్లు తెలిసింది. రౌడీషీటర్ నాగ, అతని సహచరులను ఉంచిన బ్యారక్‌లో ఈ వస్తువులు అన్నీ చిక్కాయని కన్నడ మీడియా అంటోంది.

దాడి నేపథ్యంలో రౌడీ నాగ, అతనికి సహకరించిన జైలులోని కొంతమంది అధికారులు, సిబ్బందికి మరిన్ని ఇబ్బందులు ఎదురైనాయని తెలిసింది. ఈ దాడిలో మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ లభ్యమైన ఘటనలో రౌడీ నాగతో పాటు అతడికి సహకరించిన వారిపైనే కాకుండా జైలు అధికారులపై కూడా పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ లో విడివిడిగా కేసులు నమోదైనాయని కన్నడ మీడియా తెలిపింది. హీరో

దర్శన్ కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి.

There is a rumor that drugs have been found in the jail where Kannada hero Darshan s friend is staying
ఈ చర్యలకు సంబంధించి జైల్లో ఉన్న రౌడీషీటర్ నాగతో పాటు కొంతమందిని పోలీసులు విచారించారు. అయితే ఆ సమయంలో సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్లు, సిగరెట్ సహా ఇతర వస్తువులు పోలీసులకు కనిపించలేదు.

ఈలోగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి డాక్టర్. జి. పరమేశ్వర్ తదితరులు వివరణ కూడా ఇచ్చారు. హీరో దర్శన్‌ తో పాటు అతని గ్యాంగ్‌ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి వేరే జైళ్లకు పంపించిన రెండు వారాల తర్వాత మళ్లీ పరప్పన అగ్రహార జైలులో రహస్య కార్యకలాపాలు మొదలైనాయని ఆరోపణలు ఉన్నాయి.దీనిపై సమాచారం అందుకున్న డీసీపీ సారా ఫాతిమా జైలుపై ఆకస్మిక దాడికి ప్లాన్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+