పాకిస్తాన్ కు కూడ ఆ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళొచ్చు: సదానందగౌడ
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలను హైద్రాబాద్ కు తరలించడంపై బిజెపి నేత సదానందగౌడ శుక్రవారం నాడు స్పందించారు. కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలను ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చని ఆయన చెప్పారు. అయితే పాకిస్థాన్ కు కూడ ఎమ్మెల్యేలను కూడ తీసుకెళ్ళినా తమకు అభ్యంతరం లేదని బిజెపి నేత సదానంద గౌడ అభిప్రాయపడ్డారు.
Recommended Video

తమకు కావాల్సిన మెజార్టీ ఉందని, లేకుంటే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తామని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌పై తరలించడంపై స్పందించారు. అది వారి హక్కని చెప్పారు. వారందరిని ఎక్కడికి తీసుకెళ్లినా చివరకు పాకిస్తాన్‌కు తీసుకెళ్లిన తమకొచ్చిన ఇబ్బందేమి లేదన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో బిఎస్ యడ్యూరప్ప ప్రమాణం చేశారు. అయితే బలనిరూపణను యడ్యూరప్ప చేసుకోవాల్సి ఉంది. మే 19వ తేదిన సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది.
అయితే విశ్వాస పరీక్షల్లో విజయం సాధిస్తామని బిజెపి నేతలు ధీమాగా కూడ ఉన్నారు. కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు కూడ కాంగ్రెస్ నేతలు బలాన్ని నిరూపించుకొంటామని ధీమాగా ఉన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు హైద్రాబాద్ కు తరలించారు.












Click it and Unblock the Notifications