వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతిపై యాసిడ్ దాడి కేసు కొత్త మలుపు తిరిగింది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మొరదాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో జనవరి 1న సమాజ్ వాదీ పార్టీకి చెందిన కార్యకర్త కొడుకు 19 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించడమే కాకుండా, యాసిడ్‌తో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కేసు మరో మలుపు తిరిగింది.

ఈ కేసుకు సంబంధించి తన కుమారుడిని కిడ్నాప్ చేయడమే కాకుండా, తమ కుటుంబాన్ని కూడా చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా ఈ కేసుని వాపసు తీసుకోవాలని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లు బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు.

'They Kidnapped My Son, Threatened to Kill Us,' Says Father of 19-Year-Old Acid Attack Survivor

నా 10 ఏళ్ల కొడుకును కిడ్నాప్ చేశారు. మమ్ముల్ని కూడా చంపుతామని బెదిరస్తున్నారంటూ ఆదివారం నాడు బాధితురాలి తండ్రి పోలీసులను కలిసి తమకు రక్షణ కల్పించాలని తాజాగా ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన మొరదాబాద్‌ ఎస్పీ లవ్ కుమార్ మాట్లాడుతూ సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఈ విషయంపై మాట్లాడానని చెప్పారు.

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ కుటుంబానికి అన్ని విధాల తమ సహాయం ఉంటుందని స్పష్టం చేశాడు. మొరదాబాద్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్న మని బిషోని అనే వ్యక్తి ఓ యువతిపై ఆమె ఇంట్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెపై యాసిడ్ దాడి చేశాడు.

English summary
The family of a 19-year-old college student from Uttar Pradesh's Moradabad has accused the son of a local Samajwadi Party worker of pressuring them into retracting her allegation that he threw acid on her when she resisted his attempts to molest her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X