న్యూఇయర్ వేడుకలు, పార్టీలు పూర్తి అయిన తరువాత నోరు కొట్టుకున్న యువతి, యువకులు !
అర్ధరాత్రి 12 గంటల సమయంలో సిలికాన్ సిటీ బెంగళూరులో హ్యాపీ న్యూ ఇయర్ అనే నినాదాలతో పలు ప్రాంతాలు మార్మోగిపోయాయి.' టపాకాయలు పేల్చడం, కేక్‌లు కట్ చేయడం, షాంపైన్ బాటిళ్లను పొంగించడం చేసిన యువతి, యువకులు ఒకరినొకరు కౌగిలించుకుని నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకున్నారు. తరువాతే అసలు కథ మొదలైయ్యింది.
బెంగళూరు సిటీలోని ఎంజీ రోడ్డు, కమర్షియల్ స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్డు, చర్చి స్ట్రీట్, ఇందిరానగర్, కోరమంగళ, వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ న్యూఇయర్ పార్టీల రద్దీతో ఆ ప్రాంతాలు కిటకిటలాడిపోయాయి. బెంగళూరులోని హోటళ్లు, పబ్బులు, రెస్టారెంట్లు యూత్ పార్టీలకు కేర్ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. 2023కి వీడ్కోలు పలికి 2024 కొత్త సంవత్సరానికి యువత తెరలేపింది. మద్యం మత్తులో ఉన్న యువతీ యువకులు ఎక్కడ చూసినా డ్యాన్స్ లు చేశారు.

హ్యాపీ న్యూఇయర్ అంటూ అరుస్తూనే కేకలు వేస్తూ మద్యం మత్తులో మునిగిపోయారు. లిక్కర్ పార్టీలు, న్యూఇయర్ పార్టీలలో చేరిన ఎక్కువ మంది ధనిక వర్గానికి చెందిన యువతి, యువకులే. అందరి చేతుల్లో ఖరీదైన మొబైల్స్ ఉన్నాయి. న్యూఇయర్ పార్టీలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఆదివారం అర్దరాత్రి లక్షలాది రూపాయాల విలువైన మొబైల్ చోరీలు చేశారు. మద్యం మత్తులో ఉన్న యువకుల గుంపులో కలిసిపోయిన దొంగలు పండుగ చేసుకున్నారు.

యువకుల ట్రౌజర్ జేబుల్లో ఉన్న మొబైల్ ఫోన్లను లూటీ చేశారు. మనీ పర్స్ లు దోచుకున్నారు. న్యూఇయర్ పార్టీలు పూర్తి అయిన తరువాత దొంగల చేతిలో మొబైల్ ఫోన్ లు, మనీ పర్స్ లు, బంగారు గొలుసులు పోగొట్టుకున్న వాళ్లు షాక్ అయ్యారు ఎంజీ రోడ్డు, చర్చి స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్డులో ఎక్కువగా ఇలాంటి దొంగతనాలు, మొబైల్ ఫోన్ చోరీల కేసులు వెలుగు చూశాయి. బెంగళూరులోని అశోక్ నగర్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications