Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్ ఫొటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు నెటిజన్ల ప్రశంసలు!!

2024 లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలలో గతంతో పోల్చుకుంటే ఎక్కువగా ఓటర్లలో చైతన్యం వచ్చి అనేక ప్రాంతాలలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు చేశారు. ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. స్వీప్ ద్వారా అన్ని రాష్ట్రాలలోనూ ఓటరు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాయి.

ఓటు వేసి, వేలికి సిరాతో .. ఈ ఎన్నికల బెస్ట్ ఫోటో ఇదే
ఈ క్రమంలో అనేక ఆదివాసీ గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 2024 ఎన్నికలకు సంబంధించిన ఒక ఫోటో ఈ ఎన్నికల బెస్ట్ ఫోటోగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన కథనాలను తన ఖాతా ద్వారా పంచుకునే ఆనంద్ మహీంద్రా 2024 లోక్సభ ఎన్నికలలో ఓటు వేసిన ఒక వ్యక్తి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

This is the best photo in 2024 elections Anand Mahindra tweet Netizens praised the democracy

నా వరకు బెస్ట్ ఫోటో ఇదేనన్న ఆనంద్ మహీంద్రా
ఇక అందులో ప్రత్యేకత ఏమిటి అంటే మనదేశంలో అంతరించిపోతున్న అరుదైన తెగకు చెందిన వ్యక్తి తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న ఫోటోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా 2024 ఎన్నికల బెస్ట్ ఫోటో ఇదేనని ట్వీట్ చేశారు. తనవరకు ఇదే బెస్ట్ ఫోటో అంటూ గ్రేట్ నికోబార్ దీవుల్లోని షోంపెన్ తెగలోని ఏడుగురు వ్యక్తులలో ఒకరు తొలిసారి తన వినియోగించుకున్నారని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.

ఆనంద్ మహీంద్రా పోస్ట్ కు నెటిజన్లు ఫిదా
ఇది ప్రజాస్వామ్యానికి ఎదురులేని, తిరుగులేని శక్తి అంటూ ఆయన తన ట్వీట్లో వెల్లడించారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు కూడా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. పిక్చర్ అఫ్ ది డే అంటూ ఆ ఫోటోకు కామెంట్లు పెడుతున్నారు.

నికోబార్ దీవుల్లో ఆదివాసీలు తొలిసారి ఓటు వేసిన ఫోటోలు
గ్రేట్ నికోబార్ దీవుల్లోని షోంపెన్ తెగలోని ఏడుగురు వ్యక్తుల కోసం అక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా షోంపెన్ హట్ పేరుతో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడి వారి ఓటు హక్కును వినియోగించుకునేలా చేసింది. తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన వీరంతా ఓటు వేశారు. వీళ్ళు ఓటు వేసిన ఫోటోలను అండమాన్ నికోబార్ దీవుల ఎన్నికల అధికారి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ ఫోటోతో ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫోటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+